iDreamPost
android-app
ios-app

VIDEO: నవ్వు తెప్పిస్తున్న విచిత్రమైన బౌలింగ్‌ యాక్షన్‌!

  • Published Aug 26, 2023 | 12:13 PM Updated Updated Aug 26, 2023 | 12:13 PM
  • Published Aug 26, 2023 | 12:13 PMUpdated Aug 26, 2023 | 12:13 PM
VIDEO: నవ్వు తెప్పిస్తున్న విచిత్రమైన బౌలింగ్‌ యాక్షన్‌!

క్రికెట్‌లో వివిధ రకాల యాక్షన్‌తో బౌలర్లు బౌలింగ్‌ చేస్తుంటారు. కానీ చాలా మంది బౌలర్ల బౌలింగ్‌ యాక్షన్‌ సాధారణంగానే ఉంటుంది. ముఖ్యంగా రన్నప్‌లో దాదాపు ప్రతి పేస్‌ బౌలర్‌ కూడా ఒకేలా పరిగెడతారు. కానీ, బాల్‌ రిలీజ్‌ చేసే సమయంలోనే కాస్త వేరియేషన్స్‌ చూపిస్తుంటారు. క్రికెట్‌లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. శ్రీలంక మాజీ స్టార్‌ పేసర్‌, యార్కర్ల కింగ్‌ లసిత్‌ మలింగా, టీమిండియా నుంచి జస్ప్రీత్‌ బుమ్రా, పాకిస్థాన్‌ నుంచి సోహెల్‌ తన్విర్‌, షోయబ్‌ అక్తర్‌, సౌతాఫ్రికాకు చెందిన పాల్‌ ఆడమ్స్‌ బౌలింగ్‌ యాక్షన్‌ కాస్త వెరైటీగా ఉంటుంది.

వాళ్లు బాల్‌ రిలీజ్‌ చేసే యాక్షన్‌ గతంలో ఉన్న బౌలర్లకు భిన్నంగా ఉండేది. దీంతో వారి బౌలింగ్‌ యాక్షన్‌తో కూడా వైరల్‌ అయ్యారు. అలాగే అప్పుడప్పుడు బౌలింగ్‌ వేసే టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బౌలింగ్‌ యాక్షన్‌ సైతం చాలా విచిత్రంగా ఉంటుంది. అయితే.. వీళ్లందరి బౌలింగ్‌ యాక్షన్‌ వెరైటీగా ఉందనే పేరు మాత్రం వచ్చింది కానీ, వారి యాక్షన్‌ చూసి ఎవరికీ నవ్వు రాలేదు. కానీ, ఈ వీడియోలో బౌలర్‌ బౌలింగ్‌ యాక్షన్‌తో పాటు రన్నప్‌ కూడా చాలా భిన్నంగా ఉంది. చూస్తే.. నవ్వకుండా ఉండలేరు.

ఓ రెండు రోజుల నుంచి ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ వీడియోలోని బౌలర్‌.. బౌలింగ్‌ యాక్షన్‌కు వివిధ రకాల పాటలను యాడ్‌ చేస్తూ.. నెటిజన్లు ఆ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు. ఇక వీడియో చూసిన వాళ్లు.. ఇదేం బౌలింగ్‌ యాక్షన్‌ రా బాబు.. నవ్వి నవ్వి చచ్చిపోయేలే ఉన్నాం అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అయితే.. ఆ బౌలర్‌ సరదాగా అలా బౌలింగ్‌ వేశాడా? లేక నిజంగానే అతని బౌలింగ్‌ యాక్షన్‌ అలానే ఉంటుందా? అనే విషయం తెలియదు. కానీ, వీడియో మాత్రం బాగా వైరల్‌ అవుతుంది. మరి కిందున్న వీడియో చూసి.. అతని బౌలింగ్‌ యాక్షన్‌ చూసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: యోయో టెస్ట్‌లో కోహ్లీ కంటే ఎక్కువ స్కోర్‌ చేసిన గిల్‌!