iDreamPost
android-app
ios-app

48 ఏళ్ల ప్రపంచ కప్ చరిత్రలో అరుదైన రికార్డు! తొలిసారి ఇలా..

  • Author Soma Sekhar Published - 10:14 AM, Fri - 17 November 23

వరల్డ్ కప్ లో భాగంగా తాజాగా జరిగిన ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రను తిరగరాస్తూ.. ఓ అరుదైన ఘనత నమోదు అయ్యింది. మరి ఆ రికార్డు ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ కప్ లో భాగంగా తాజాగా జరిగిన ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రను తిరగరాస్తూ.. ఓ అరుదైన ఘనత నమోదు అయ్యింది. మరి ఆ రికార్డు ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 10:14 AM, Fri - 17 November 23
48 ఏళ్ల ప్రపంచ కప్ చరిత్రలో అరుదైన రికార్డు! తొలిసారి ఇలా..

ప్రపంచ కప్ 2023.. ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. సంచలనాలతో పాటుగా కనీవినీ ఎరుగని రీతిలో ఈ మెగాటోర్నీలో రికార్డులు బద్దలవుతూ వస్తున్నాయి. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు పోటాపోటీగా రికార్డులు సాధిస్తూ.. అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. అయితే ఈ రికార్డుల వేటలో టీమిండియా ఆటగాళ్లే ముందున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తాజాగా జరిగిన ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రను తిరగరాస్తూ.. ఓ అరుదైన ఘనత నమోదు అయ్యింది. మరి ఆ రికార్డు ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ కప్ తుది సమరానికి సమయం ఆసన్నమైంది. ఫైనల్లో టీమిండియాను ఢీకొనేందుకు ఆసీస్ సిద్దమవుతోంది. గురువారం సౌతాఫ్రికాతో జరిగిన నాకౌట్ మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో కంగారూ టీమ్ విజయం సాధించింది. దీంతో ఏకంగా ఎనిమిదోసారి వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో సఫారీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీతో మెరిసిన విషయం తెలిసిందే. ఈ శతకం ద్వారా వరల్డ్ కప్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు నమోదు అయ్యింది. 48 సంవత్సరాల వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక శతకాలు నమోదైన వరల్డ్ కప్ గా ఈ ఎడిషన్ నిలిచింది. మిల్లర్ సెంచరీతో కలిపి ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు 39 శతకాలు నమోదు అయ్యాయి.

ఇక ఈ మెగాటోర్నీలో డికాక్ 4, కోహ్లీ, రచిన్ రవీంద్ర మూడేసి శతకాలు సాధించగా.. శ్రేయస్ అయ్యర్, డార్లీ మిచెల్, వార్నర్, మార్ష్, డస్సెన్, మాక్స్ వెల్ ఈ టోర్నీలో రెండేసి శతకాలు నమోదు చేశారు. రోహిత్ శర్మ, మార్క్రమ్, కేఎల్ రాహుల్ తో పాటుగా మరికొందరు ఒక్కో సెంచరీ చేశారు. కాగా.. వరల్డ్ కప్ నాకౌట్స్ లో సెంచరీ కొట్టిన తొలి సఫారీ బ్యాటర్ గా నిలిచాడు డేవిడ్ మిల్లర్. ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న ఈ వరల్డ్ కప్.. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. మరి ప్రపంచ కప్ హిస్టరీలోనే అత్యధిక సెంచరీలు సాధించిన ఎడిషన్ గా ఈ సీజన్ నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.