Nidhan
Morne Morkel: టీ20 వరల్డ్ కప్ ముగిశాక టీమిండియా మేనేజ్మెంట్లో మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ గంభీర్ సహా ఇంకొందరు జట్టు కోచింగ్ బృందంలో చేరారు. అయితే బౌలింగ్ కోచ్‌గా మాత్రం ఎవర్నీ తీసుకోలేదు.
Morne Morkel: టీ20 వరల్డ్ కప్ ముగిశాక టీమిండియా మేనేజ్మెంట్లో మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ గంభీర్ సహా ఇంకొందరు జట్టు కోచింగ్ బృందంలో చేరారు. అయితే బౌలింగ్ కోచ్‌గా మాత్రం ఎవర్నీ తీసుకోలేదు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 ముగిశాక భారత క్రికెట్లో వేగంగా మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ పదవి నుంచి దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ తప్పుకోవడంతో కొత్త కోచ్ కోసం అన్వేషణ మొదటుపెట్టింది భారత క్రికెట్ బోర్డు. ఈ క్రమంలో పలువుర్ని ఇంటర్వ్యూ చేసి ఆఖరికి గౌతం గంభీర్‌ను ఆ రోల్‌కు ఎంపిక చేసింది. శ్రీలంక సిరీస్‌తో హెడ్ కోచ్‌గా గౌతీ బాధ్యతలు చేపట్టాడు. అతడు టీమ్‌లోకి రాకముందే కోచింగ్ బృందంలో తనకు నచ్చిన వారిని ఎంచుకున్నాడు. బీసీసీఐ స్వేచ్ఛ ఇవ్వడంతో అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ పేర్లను రికమెండ్ చేశాడు. అయితే అభిషేక్ నాయర్ నియామకానికి ఓకే చెప్పిన బోర్డు.. మోర్కెల్ విషయంలో ఎటూ తేల్చలేదు. నాయర్ లంక సిరీస్‌తో భారత జట్టుతో చేరాడు. కానీ మోర్కెల్ పరిస్థితి ఏంటనేది క్లారిటీ లేకుండా పోయింది.
ఎట్టకేలకు భారత బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ రాక ఖాయమైందని తెలుస్తోంది. మెన్ ఇన్ బ్లూ న్యూ బౌలింగ్ కోచ్‌గా ఈ సౌతాఫ్రికా దిగ్గజం నియామకానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని క్రికెట్ వర్గాల సమాచారం. మోర్కెల్ నియామకంపై అతి త్వరలో బోర్డు నుంచి అధికారిక ప్రకటన వెలువడనుందని నేషనల్ మీడియాలో వినిపిస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మోర్నెల్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జియాంట్స్ టీమ్‌కు పని చేసిన మోర్కెల్.. భారత జట్టు కోచింగ్ బృందంలో చేరేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాడని తెలుస్తోంది.
శ్రీలంక సిరీస్‌కు ముందే మోర్కెల్ నియామకంపై ప్రకటన చేద్దామని బీసీసీఐ పెద్దలు భావించారట. అయితే వ్యక్తిగత కారణాల వల్ల అతడు అందుబాటులో లేకపోవడంతో ఆగిపోయారట. ఇప్పుడు ఆ పనులన్నీ ముగించుకొని టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఛార్జ్ తీసుకునేందుకు ఈ సౌతాఫ్రికా మాజీ పేసర్ సిద్ధమయ్యాడట. ఇదే విషయాన్ని బోర్డుకు చెప్పగా.. అటు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో అదే నెల ఒకటో తేదీన మోర్కెల్ నియామకంపై అధికారిక ప్రకటన చేస్తారని వినిపిస్తోంది. ఇది తెలిసిన నెటిజన్స్.. మొత్తానికి గంభీర్ ఏం అనుకున్నాడో అది సాధించాడని అంటున్నారు. కోచింగ్ బృందంలో తాను ఎవరినైతే అనుకున్నాడో వారినే తీసుకొస్తున్నాడని చెబుతున్నారు. మరి.. భారత బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ సక్సెస్ కాగలడా? మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
🚨 MORNE MORKEL APPOINTED AS INDIA’S BOWLING COACH. 🚨
– Time for Gambhir and Morkel reunion. (Cricbuzz). pic.twitter.com/LtrYmWsJXg
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2024