iDreamPost
android-app
ios-app

ఆ టైమ్ లో క్రికెట్ వదిలేసి.. వేరే పని చేద్దామనుకున్నా: సిరాజ్

  • Author Soma Sekhar Updated - 10:37 AM, Fri - 22 September 23
  • Author Soma Sekhar Updated - 10:37 AM, Fri - 22 September 23
ఆ టైమ్ లో క్రికెట్ వదిలేసి.. వేరే పని చేద్దామనుకున్నా: సిరాజ్

మహ్మద్ సిరాజ్.. గత కొన్నిరోజులుగా వరల్డ్ క్రికెట్ లో మారుమ్రోగుతున్నపేరు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక బ్యాటర్లకు వణుకు పుట్టించి.. ఆ మ్యాచ్ ను ఓ పీడకలగా మార్చాడు సిరాజ్. ఈ మ్యాచ్ లో సిరాజ్ బౌలింగ్ ఎలా ఆడాలో కూడా లంక బ్యాటర్లకు అర్థం కాలేదు. ఇక 6 వికెట్లతో చెలరేగిన సిరాజ్.. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలి రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలను, తన ఫ్యామిలీ పరిస్థితులను చెప్పుకొచ్చాడు సిరాజ్. ఒకానొక టైమ్ లో తాను క్రికెట్ మానేసి, వేరే పని చూసుకుందాం అనుకున్నాడట సిరాజ్.

సిరాజ్.. ఓ సాధారణ ఆటో డ్రైవర్ కొడుకు నుంచి టీమిండియా స్టార్ క్రికెటర్ గా ఎదిగిన తీరు అమోఘమనే చెప్పాలి. ఇక కెరీర్ ఆరంభించిన తొలి రోజుల్లో తాను పడ్డ కష్టాల గురించి అలాగే తన కుటుంబ పరిస్థితుల గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాలేజ్ కు బంక్ కొట్టి వెళ్లి క్రికెట్ ఆడేవాడినని, తనకు రోజుకు పాకెట్ మనీ కింద రూ. 70 తన తల్లిదండ్రులు ఇచ్చేవారని చెప్పుకొచ్చాడు సిరాజ్. అప్పట్లో తాను క్రికెట్ ఆడటానికి షూస్ కూడా సరిగా ఉండేవి కాదని పేర్కొన్నాడు. ఇక సిరాజ్ ఆడిన తొలి వన్డేలో ఒక్క వికెట్ కూడా తీసుకోకపోగా.. ప్రత్యర్థి బ్యాటర్లు భారీగా పరుగులు పిండుకున్నారు. ఇక అదే ఏడాది జరిగిన ఐపీఎల్ లో కూడా సిరాజ్ తేలిపోయాడు. దీంతో తన తండ్రి ఆటోడ్రైవర్ అనే విషయాన్ని గుర్తుచేస్తూ.. కొందరు నువ్వు కూడా క్రికెట్ వదిలేసి ఆటో తోలుకో అని అవమానించినట్లు తెలిపాడు సిరాజ్.

కాగా.. లాక్డౌన్ సమయంలో సిరాజ్ తన కెరీర్ గురించి తీవ్రంగా ఆలోచించినట్లు పేర్కొన్నాడు. ఇదే టైమ్ లో ఒకే ఒక్క సంవత్సరంలో క్రికెట్ లో ఏది సాధించాలో అది సాధిస్తానని, లేకపోతే క్రికెట్ వదిలేసి వేరే పనిచూసుకుంటానని నిర్ణయించుకున్నానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు సిరాజ్. ఈ నిర్ణయం తర్వాత సిరాజ్ అద్భుతంగా రాణించాడు. వన్డేల్లో టాప్ క్లాస్ బౌలర్ గా ఎదిగాడు. ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్ బౌలర్ గా సిరాజ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తనను అవమానించిన వారికి తన బౌలింగ్ తోనే సమాధానం ఇచ్చాడు ఈ హైదరాబాదీ స్పీడ్ స్టర్. మరి సిరాజ్ పంచుకున్న విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.