టీమిండియా స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ వన్డేల్లో నంబర్ వన్ బౌలర్‌గా అవతరించాడు. బ్యాటర్ల ర్యాంకుల్లో శుబ్‌మన్ గిల్ టాప్ ప్లేస్‌కు దూసుకొచ్చాడు.
టీమిండియా స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ వన్డేల్లో నంబర్ వన్ బౌలర్‌గా అవతరించాడు. బ్యాటర్ల ర్యాంకుల్లో శుబ్‌మన్ గిల్ టాప్ ప్లేస్‌కు దూసుకొచ్చాడు.
మహ్మద్ సిరాజ్.. టీమిండియా ఫ్యాన్స్‌కు పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్లోకి ఓ రాకెట్లా దూసుకొచ్చాడీ యంగ్ పేసర్. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా కేవలం తన టాలెంట్‌ను నమ్ముకొని ఈ స్థాయికి చేరుకున్నాడు సిరాజ్. ఒకప్పుడు హైదరాబాద్‌లో లోకల్ మ్యాచులు ఆడే ప్లేయర్ ఆ తర్వాత రంజీలకు సెలెక్ట్ అవ్వడం, అక్కడ బాగా పెర్ఫార్మ్ చేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడే ఛాన్స్ దక్కించుకోడం తెలిసిందే. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అదరగొట్టి అప్పటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కళ్లల్లో పడ్డాడు. మంచి పేస్‌తో బౌలింగ్ వేస్తుండటం, సీమింగ్ డెలివరీస్‌తో బ్యాటర్లను బుట్టలో వేసుకోవడంతో సిరాజ్‌ను మరింత ఎంకరేజ్ చేశాడు కోహ్లీ. ఆ తర్వాత అద్భుతంగా రాణించి ఏకంగా టీమిండియాలోనే చోటు దక్కించుకున్నాడీ హైదరాబాదీ పేసర్.
కెరీర్ మొదట్లో వికెట్లు తీస్తున్నా బాగా రన్స్ ఇచ్చేవాడు సిరాజ్. ఇప్పుడు కూడా ఒక్కోసారి భారీగా పరుగులు ఇస్తుంటాడు. అయితే రన్స్ ఇచ్చినా కంటిన్యూగా వికెట్లు తీస్తుంటాడు సిరాజ్. పిచ్ నుంచి స్వింగ్ రాబడుతూనే సీమ్ డెలివరీస్‌ను సంధిస్తూ బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక్కోసారి పరుగులు వెళ్లినా వికెట్లు కూడా పడతాయి. అందుకే సిరాజ్‌ను పిలిచి మరీ బౌలింగ్ ఇస్తుంటారు కెప్టెన్స్. అతడి బౌలింగ్ మీద ఉన్న నమ్మకం, వికెట్లు తీయాలనే కసి ఉండటంతో ఎంకరేజ్ చేస్తుంటారు. తనకు వచ్చిన ప్రతి ఛాన్స్‌ను అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్న ఈ స్టార్ పేసర్ క్రమంగా అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్‌గా మారాడు. ఆసియా కప్-2023 నుంచి సిరాజ్ మరింత డేంజరస్ బౌలర్‌గా మారాడు. ఆ టోర్నీ ఫైనల్స్‌లో శ్రీలంకను పోయించాడీ స్పీడ్‌స్టర్. అతడి దెబ్బకు లంక కేవలం 50 రన్స్‌కు ఆలౌట్ అయింది. ఆ మ్యాచ్‌లో సిరాజ్ ఒక్కడే 6 వికెట్లు తీశాడు.
ఆసియా కప్ ఫామ్‌నే వరల్డ్ కప్-2023లోనూ కంటిన్యూ చేస్తున్నాడు మహ్మద్ సిరాజ్. భారత బౌలింగ్ టైమ్‌లో మరో పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆచితూచి ఆడుతున్న ప్రత్యర్థి బ్యాటర్లు.. సిరాజ్, షమీలకు దొరికిపోతున్నారు. ఆసియా కప్ నుంచి వరల్డ్ కప్ స్టార్టింగ్ మ్యాచుల వరకు షమి లాంటి సీనియర్ బౌలర్‌ను కాదని.. సిరాజ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇచ్చారంటే అతడిపై కెప్టెన్ రోహిత్‌కు ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తన అద్భుతమైన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్న సిరాజ్.. ఐసీసీ రీసెంట్గా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ప్లేస్ దక్కించుకున్నాడు.
ర్యాంకుల గురించి సిరాజ్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. ‘వన్డే క్రికెట్లో గతంలో ఒకసారి నంబర్ వన్ అయ్యా. ఆ తర్వాత ర్యాంకును నేను కోల్పోయా. మళ్లీ ఇప్పుడు ఫస్ట్ ప్లేసుకు వచ్చా. అందుకే ఈ ర్యాంకుల గురించి పెద్దగా ఏమీ అనిపించట్లేదు. టీమిండియా వరల్డ్ కప్ నెగ్గడమే ముఖ్యం. జట్టులోని ప్రతి సభ్యుడిదీ ఇదే టార్గెట్. నా గోల్ కూడా ఇదే. నా పెర్ఫార్మెన్స్ టీమ్‌కు ఎంత వరకు ఉపయోగపడిందనేదే కీలకం. టోర్నమెంట్లో ప్రతి ప్లేయరూ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడుతున్నారు. ఇలాంటి టీమ్‌లో స్థానం దక్కించుకోవడం గర్వంగా ఉంది. ఇక వరల్డ్ కప్ నెక్స్ట్ ఫేజ్లోనూ మా పెర్ఫార్మెన్స్ ఇలాగే ఉంటుందని నమ్ముతున్నా’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. మరి.. ర్యాంకుల గురించి సిరాజ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇండియాతో సెమీస్.. కేన్ విలియమ్సన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Mohammed Siraj said, “No.1 Ranking doesn’t matter to me, my ultimate goal is to win the World Cup for India”. (ICC). pic.twitter.com/xxkzjoMspo
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 9, 2023