ఓ ఇంటివాడు కానున్న టీమిండియా స్టార్‌ సిరాజ్‌! వధువు ఎవరంటే?

  • Author pasha Published - 05:45 PM, Thu - 23 November 23

భారత స్టార్ క్రికెట్ మహ్మద్ సిరాజ్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్. మన టీమ్​ బౌలింగ్​ యూనిట్​లో కీలకంగా మారిన సిరాజ్ మియా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడని సమాచారం.

భారత స్టార్ క్రికెట్ మహ్మద్ సిరాజ్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్. మన టీమ్​ బౌలింగ్​ యూనిట్​లో కీలకంగా మారిన సిరాజ్ మియా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడని సమాచారం.

  • Author pasha Published - 05:45 PM, Thu - 23 November 23

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, మన హైదరాబాదీ కుర్రాడు మొహమ్మద్‌ సిరాజ్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని సమాచారం. ఇటీవల వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆడి రెస్ట్‌ తీసుకుంటున్న మియా భాయ్‌.. త్వరలోనే షాదీ ముబారక్‌ అందుకోనున్నట్లు తెలుస్తోంది. పేద కుటుంబం నుంచి కేవలం తన ప్రతిభను మాత్రమే నమ్మకుని.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో దేశానికి ప్రాతినిథ్యం వహించే స్థాయి ఎదిగాడు సిరాజ్‌. మన హైదరాబాద్‌ గల్లీల్లో తిరుగుతూ.. టెన్నిల్‌ బాల్‌తో క్రికెట్‌ ఆడుతూనే.. టీమిండియాలో చోటు సాధించాడు. ఓ సాధారణ ఆటో డ్రైవర్‌ కుమారుడిగా ఉన్న సిరాజ్‌.. ఈ రోజు కొన్ని కోట్ల మంది యువతకు స్ఫూర్తినిచ్చేలా మారాడు.

సిరాజ్‌ జర్నీ దేశంలోని ప్రతి యువకుడికి ఆదర్శప్రాయం. సరైన సౌకర్యాలు, ఆర్థిక తోడ్పాటు లేకపోయినా.. టాలెంట్‌ ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి సిరాజ్‌. టీమిండియా తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనే భారీగా పరుగులు ఇచ్చినా కూడా.. ఎక్కడా కుంగుబాటుకు గురికాకుండా.. తనని తాను మెరుగుపర్చుకుంటూ.. ఒక పదునైనా కత్తిలా మారాడు. బంతిని రెండు వైపుల స్వింగ్‌ చేస్తూ.. స్వింగ్‌ కింగ్‌గా ఎదిగాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా సిరాజ్‌ చరిత్ర సృష్టించాడు. అలాగే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వన్డే క్రికెట్‌లో నంబర్‌ వన్‌ బౌలర్‌గా కూడా కొనసాగాడు.

తాజాగా ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌లోనూ సిరాజ్‌ మంచి ప్రదర్శనే కనబర్చాడు. 14 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. అయితే.. ప్రస్తుతం సిరాజ్‌ వయసు 29 ఏళ్లు. దీంతో.. సిరాజ్‌ కుటుంబ సభ్యులు అతనికి ఒక మంచి జోడీని వెతికే పనిలో పడ్డారు. కొత్త జీవితం ప్రారంభించేందుకు సిరాజ్‌ సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. దీంతో మరికొన్ని రోజుల్లోనే సిరాజ్‌కు కాబోయే వధువు ఎవరో అధికారికంగా తెలియనుంది. ప్రస్తుతానికి హైదరాబాద్‌కి చెందిన అమ్మాయిగా తెలుస్తుంది. బహుషా.. వచ్చే ఐపీఎల్‌ కంటే ముందే సిరాజ్‌ వివాహం జరుగుతుందని తెలుస్తుంది. మరి సిరాజ్‌ పెళ్లికి రెడీ అవుతుందటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్, కోహ్లీకి BCCI ఓపెన్ ఆఫర్! ఇదే మంచి ఛాన్స్!

Show comments