Nidhan
ఐపీఎల్ 2024 ఆక్షన్ ముగిసింది. తమకు నచ్చిన ప్లేయర్లను దక్కించుకున్న టీమ్స్.. నెక్స్ట్ సీజన్‌కు సంబంధించిన ప్రిపరేషన్స్‌లో మునిగిపోయాయి. ఈ టైమ్‌లో ఆర్సీబీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ షాకింగ్ పోస్ట్ పెట్టాడు.
ఐపీఎల్ 2024 ఆక్షన్ ముగిసింది. తమకు నచ్చిన ప్లేయర్లను దక్కించుకున్న టీమ్స్.. నెక్స్ట్ సీజన్‌కు సంబంధించిన ప్రిపరేషన్స్‌లో మునిగిపోయాయి. ఈ టైమ్‌లో ఆర్సీబీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ షాకింగ్ పోస్ట్ పెట్టాడు.
Nidhan
ఐపీఎల్ మినీ వేలం సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. పదిహేడో సీజన్‌కు ముందు నిర్వహించిన ఆక్షన్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్లు మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లు, ప్యాట్ కమిన్స్ రూ.20.05 కోట్లు దక్కించుకొని సంచలనం సృష్టించారు. వేలంలోనే కాకుండా పదహారేళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా కూడా రికార్డు నమోదు చేశారు. మిగిలిన కొందరు స్టార్లు కూడా మంచి ధరకే అమ్ముడుపోయారు. భారీ ధరకు పోతారనుకున్న మరికొందరు ఆటగాళ్లు అన్‌సోల్డ్‌గా మిగిలి నిరాశపర్చారు. ఈసారి ఆక్షన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ టీమ్ కాంబినేషన్లో సరిపోయే ఆటగాళ్లను తీసుకుంది. బౌలింగ్ యూనిట్ వీక్‌గా ఉండటంతో దాన్ని బలోపేతం చేసుకునేందుకు పేసర్లను కొనుగోలు చేసింది. అయితే ఆక్షన్ ముగిసిన తర్వాత ఆ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఓ షాకింగ్ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఐపీఎల్ మినీ వేలం తర్వాత సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. హార్ట్ బ్రేక్ ఎమోజీలను షేర్ చేశాడు. దీనికి ఎటువంటి క్యాప్షన్స్ గానీ హ్యాష్‌ట్యాగ్స్ గానీ జత చేయలేదు. దీంతో అసలు సిరాజ్ ఎవర్ని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టాడు? అనేది అర్థం గాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులు సిరాజ్ ఎందుకీ పోస్ట్ పెట్టాడో తెలుసుకునే పనిలో బిజీ అయిపోయారు. ఆక్షన్‌కు ముందు ప్లేయర్ల రిటెన్షన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ నుంచి కామెరాన్ గ్రీన్‌ను తెచ్చుకుంది బెంగళూరు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటే ఈ మేటి ఆల్‌రౌండర్ కోసం ఏకంగా రూ.17.5 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత మినీ వేలంలో ఎక్కువగా బౌలర్ల మీద ఫోకస్ చేసింది. టీమ్ బౌలింగ్ యూనిట్ బలహీనంగా ఉండటం, సిరాజ్ తప్ప టీమ్‌లో మరో స్టార్ బౌలర్ లేకపోవడంతో ఆ లోటును భర్తీ చేయడం మీద దృష్టి పెట్టింది ఆర్సీబీ.
ఆక్షన్‌లో రీస్ టోప్లీ, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రన్, లోకీ ఫెర్గూసన్ లాంటి మంచి క్వాలిటీ బౌలర్లను సొంతం చేసుకుంది ఆర్సీబీ. కానీ మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ వంటి ఒక్క స్టార్ పేసర్‌ను కూడా దక్కించుకోలేదు. కమిన్స్ కోసం ఆఖరి వరకు ప్రయత్నించినా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ పట్టుదల ముందు ఓడిపోయింది. దీంతో అందుబాటులో ఉన్నవారిలో బెస్ట్ బౌలర్స్‌ను తీసుకుంది. అయితే ఇటు బ్యాటింగ్‌లో కోహ్లీ, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్, గ్రీన్ వంటి స్టార్లు ఉండగా.. అటు బౌలింగ్‌లో సిరాజ్ ఒక్కడే ఎఫెక్టివ్‌గా కనిపిస్తున్నాడు. మిగతా బౌలర్లు సత్తా కలిగిన వారే కానీ సింగిల్ హ్యాండ్‌తో టీమ్‌ను గెలిపించగలరని చెప్పలేం. వేలంలో మంచి బౌలర్లను తీసుకోవడంలో ఆర్సీబీ ఫెయిలైందనే బాధతోనే సిరాజ్ హార్ట్ బ్రేక్ ఎమోజీలతో షాకింగ్ పోస్ట్ పెట్టాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లేం బౌలర్లు రా బాబు అనుకుంటూ అతడు తలలు పట్టుకుంటున్నాడని అంటున్నారు. బ్యాటింగ్ ఎంత బాగున్నా బౌలింగ్‌లో తేలిపోతే ట్రోఫీ కొట్టలేం కాబట్టే సిరాజ్ మియా అలా పోస్ట్ పెట్టాడని చెబుతున్నారు. అయితే ఆర్సీబీ పేసర్ ఎందుకిలా పోస్ట్ పెట్టాడో స్వయంగా అతడు క్లారిటీ ఇస్తే గానీ తెలియదు. మరి.. సిరాజ్ షాకింగ్ పోస్ట్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rahul Dravid: వీడియో: దుమ్మురేపిన ద్రవిడ్ తనయుడు.. అచ్చం తండ్రిని తలపిస్తూ..!
Mohammed Siraj’s Instagram story. pic.twitter.com/TSCqSCbshv
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2023