iDreamPost

Rahul Dravid: వీడియో: దుమ్మురేపిన ద్రవిడ్ తనయుడు.. అచ్చం తండ్రిని తలపిస్తూ..!

  • Published Dec 21, 2023 | 12:20 PMUpdated Dec 21, 2023 | 7:54 PM

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇద్దరు కుమారులు క్రికెట్​ను కెరీర్​గా ఎంచుకున్న విషయం తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలనే కోరికతో వాళ్లు చాలా కష్టపడుతున్నారు. తాజాగా ద్రవిడ్ పెద్ద కొడుకు సమిత్​ ఓ ఫెంటాస్టిక్ నాక్​తో ఆకట్టుకున్నాడు.

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇద్దరు కుమారులు క్రికెట్​ను కెరీర్​గా ఎంచుకున్న విషయం తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలనే కోరికతో వాళ్లు చాలా కష్టపడుతున్నారు. తాజాగా ద్రవిడ్ పెద్ద కొడుకు సమిత్​ ఓ ఫెంటాస్టిక్ నాక్​తో ఆకట్టుకున్నాడు.

  • Published Dec 21, 2023 | 12:20 PMUpdated Dec 21, 2023 | 7:54 PM
Rahul Dravid: వీడియో: దుమ్మురేపిన ద్రవిడ్ తనయుడు.. అచ్చం తండ్రిని తలపిస్తూ..!

రాజకీయాలు, సినీ రంగంలోలాగే క్రికెట్​లోనూ వారసత్వం మీద చాలా మంది అభిమానులకు ఇంట్రెస్ట్‌ ఉంటుంది. తమ ఫేవరెట్ ప్లేయర్స్ వారసులు క్రికెట్​లోకి రావాలని, వారు ఆడుతుంటే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. అయితే వారసత్వం అనేది అంత ఈజీ కాదు. వారసులపై ఉండే ప్రెజర్ అంతా ఇంతా కాదు. ప్రేక్షకులు, అభిమానుల నుంచి సపోర్ట్ ఉంటుంది. అమితమైన ప్రేమ, గౌరవాభిమానాలను పొందుతారు. కానీ వారసులు తప్పకుండా పెర్ఫార్మ్ చేయాలి. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రెజర్ వారి మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే కాబోలు క్రికెట్​లో బాగా రాణించిన వారసులు ఒకరిద్దరికి మించి పెద్దగా లేరు. వారసత్వం అనేది మిగిలిన రంగాల్లో సక్సెస్ అయి ఉండొచ్చు గానీ జెంటిల్మన్ గేమ్​లో అంతగా వర్కౌట్ కాలేదు. అయినా వారసుల మీద అభిమానుల్లో ఉండే ఎక్స్​పెక్టేషన్స్ తగ్గడం లేదు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుల పైనా అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

ప్లేయర్​గా, కెప్టెన్​గా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ద్రవిడ్ గత కొన్నాళ్లుగా నేషనల్ టీమ్​కు హెడ్ కోచ్​గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక, ద్రవిడ్​కు సమిత్ ద్రవిడ్, అన్వయ్ ద్రవిడ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారనేది తెలిసిందే. వాళ్లిద్దరూ క్రికెట్​నే కెరీర్​గా ఎంచుకున్నారు. వారిలో సమిత్ బాగా రాణిస్తున్నాడు. అతడి మీద క్రికెటింగ్ వరల్డ్ ఫోకస్ ఎప్పటి నుంచో ఉంది. అలాంటి సమిత్ కూచ్ బెహార్ అండర్​-19 ట్రోఫీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. ఈ టోర్నమెంట్​లో కర్ణాటక తరఫున ఆడుతూ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్​తో జరిగిన ఒక మ్యాచ్​లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్​లో 159 బంతులు ఎదుర్కొన్న జూనియర్ ద్రవిడ్.. 13 బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 98 రన్స్ చేశాడు. డాట్ బాల్స్ సంగతి పక్కనబెడితే అతడి షాట్ మేకింగ్, బౌలర్లపై అటాక్​కు దిగడం హైలైట్​గా నిలిచింది.

సమిత్ చేసిన పరుగుల్లో దాదాపు 60 రన్స్ వరకు బౌండరీలు, సిక్సుల ద్వారానే వచ్చాయి. ఈ ఇన్నింగ్స్​లో కొన్ని షాట్స్ అచ్చం తన తండ్రి రాహుల్ ద్రవిడ్​ను తలపించేలా ఆడాడు సమిత్. జూనియర్ ద్రవిడ్​ ఇన్నింగ్స్​కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా, ఈ మ్యాచ్​లో బౌలింగ్​లోనూ రాణించిన సమిత్ 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టు ఆలౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్​లో ఇప్పటిదాకా 5 మ్యాచులు ఆడిన సమిత్ 250 రన్స్ చేశాడు. అతడు ఇలాగే ఆడితే తక్కువ టైమ్​లోనే టీమిండియాలో ప్లేస్ దక్కించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సమిత్ డిఫెన్స్, షాట్స్ ఆడుతున్న తీరు, మెచ్యూరిటీ, గేమ్ అవేర్​నెస్ చూస్తుంటే తండ్రిని మించిన తనయుడు అయ్యేలా కనిపిస్తున్నాడు. క్రికెట్​ వారసులకు కలసిరాదనే సెంటిమెంట్​ను జూనియర్ ద్రవిడ్ మారుస్తాడేమో చూడాలి. మరి.. సమిత్ ఆటతీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Prashanth Neel: ఉగ్రం రీమేక్‌గా సలార్‌.. ప్రశాంత్‌ నీల్‌ ఏమన్నాడంటే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి