SNP
SNP
టీమిండియా యువ పేసర్, మన హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ ఆసియా కప్ 2023 ఫైనల్లో ఎలాంటి బౌలింగ్ వేశాడో మనం చూశాం. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు కళ్లు చెదిరే స్వింగ్‌తో లంకేయులను ఓ ఆట ఆడుకున్నాడు. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసుకోవడంతో పాటు మొత్తంగా 6 వికెట్లు పడగొట్టి.. వన్డే క్రికెట్‌లో తన అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. 7 ఓవర్లు కంటిన్యూగా వేసిన సిరాజ్.. కేవలం 21 పరుగులు అందులో కోహ్లీ వేసిన అనవసరపు త్రోతో 4 పరుగులు వచ్చాయి.. మొత్తం 21 రన్స్ ఇచ్చి 6 వికెట్లు కుప్పకూల్చి.. శ్రీలంక పతనాన్ని శాసించాడు.
పైగా ఆసియా కప్ ఫైనల్లో సిరాజ్ ఇలాంటి ప్రదర్శన చేయడంతో.. టీమిండియా చాలా సులువుగా తమ ఖాతాలో 8వ ఆసియా కప్ వేసుకుంది. అయితే.. మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సిరాజ్.. మ్యాచ్ తర్వాత అంతకంటే గొప్ప పనితో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సూపర్ స్పెల్‌కు గాను సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద అతనికి 5000 యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీ అందించారు. మన కరెన్సీలో అది అక్షరాల రూ.4.16 లక్షలు. ఈ మొత్తాన్ని సిరాజ్ శ్రీలంక గ్రౌండ్ స్టాఫ్‌కు ఇచ్చేశాడు.
ఆసియా కప్ టోర్నీ మొత్తం ఇంత సక్సెస్‌ఫుల్‌గా జరగడానికి గ్రౌండ్ స్టాఫ్ కష్టమే కారణమని, వారికి కృతజ్ఞతగా తన ప్రైజ్‌మనీని వారికి ఇస్తున్నట్లు సిరాజ్ వెల్లడించాడు. సిరాజ్‌తో పాటు బీసీసీఐ సైతం శ్రీలంక గ్రౌండ్ స్టాఫ్‌కు 42 లక్షలు బహుమానంగా అందించింది. ఆసియా కప్ టోర్నీలో అనేక మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించింది. భారత పాకిస్థాన్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దు అయింది. కానీ, మిగతా మ్యాచ్‌లకు సైతం వర్షం అడ్డుతగిలినా.. గ్రౌండ్ స్టాఫ్ ఎంతో శ్రమించి.. వేగంగా గ్రౌండ్‌ను ఆటకు అనువుగా మార్చారు. అందుకే సిరాజ్ వారికి ఈ విధంగా తన కృతజ్ఙతలు తెలిపాడు. మరి సిరాజ్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Great heartwarming gesture from Mohammed Siraj as he dedicated his Player of the Match (POTM) ($5000) prize money to the ground staff of Colombo. pic.twitter.com/arATkgZyrJ
— CricTracker (@Cricketracker) September 17, 2023
ఇదీ చదవండి: 23 ఏళ్ళ భారత్ పగ తీర్చిన సిరాజ్! అప్పట్లో మన పరువు తీశారు!