తెలంగాణ పోలీస్‌లో చేరిన స్టార్‌ క్రికెటర్‌ సిరాజ్‌! ఇకపై DSPగా..

Mohammed Siraj, DSP, Telangana Police, CM Revanth Reddy: మొహమ్మద్‌ సిరాజ్‌ డీఎస్పీగా ఛార్జ్‌ తీసుకున్నాడు. తెలంగాణ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో డీఎస్పీగా అపాయింట్‌ అయ్యాడు. ఆ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Mohammed Siraj, DSP, Telangana Police, CM Revanth Reddy: మొహమ్మద్‌ సిరాజ్‌ డీఎస్పీగా ఛార్జ్‌ తీసుకున్నాడు. తెలంగాణ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో డీఎస్పీగా అపాయింట్‌ అయ్యాడు. ఆ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, మన హైదరాబాదీ కుర్రాడు మొహమ్మద్‌ సిరాజ్‌ డీఎస్పీగా ఛార్జ్‌ తీసుకున్నాడు. సిరాజ్‌ను డీఎస్పీగా అపాయింట్‌ చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్‌ నియామకపత్రాలను అందజేశారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన తర్వాత.. సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగంతో పాటు, జూబ్లీహిల్స్‌లో ఇంటి స్థలం ఇస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత.. సిరాజ్‌ హైదరబాద్‌కు వచ్చి.. సీఎం రేవంత్‌ రెడ్డిని కూడా కలిశారు. ఆ సమయంలో సిరాజ్‌ను సన్మానించిన సీఎం.. డీఎస్పీ ఉద్యోగం, ఇంటిస్థలంపై ప్రకటన చేశారు.

తాజాగా అందుకు సంబంధించిన అపాయింట్‌మెంట్‌ లెటర్‌ను సిరాజ్‌కు అందజేశారు. అలాగే జూబ్లీహిల్స్‌లో 600 గజాల స్థలం కేటాయిస్తూ.. రెవెన్యూ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఒక ఆటగాడిగా.. ఇండియన్‌ క్రికెట్‌కు మంచి సేవలు అందిస్తున్న సిరాజ్‌.. తెలంగాణతో పాటు హైదరాబాద్‌కు కీర్తి ప్రతిష్టతలు తెచ్చిపెట్టాడు. ఇలా మన రాష్ట్రానికి ఒక బ్రాండ్‌లా మారిన క్రికెటర్‌ను ఈ మాత్రం గౌరవించుకోవడంలో తప్పులేదని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇప్పుడే కాదు గతంలో కూడా క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలకు అండగా నిలిచి, పలు విధాలుగా గౌరవించింది.

కాగా, ప్రస్తుతం సిరాజ్‌ రెస్ట్‌ మూడ్‌లో ఉన్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడన సిరాజ్‌.. ఇక న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. వన్డేలు, టెస్టుల్లో సిరాజ్‌ టీమిండియాకు ఒక కీ బౌలర్‌గా మారిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌ కప్‌ 2023, ఆసియా కప్‌ 2023లో సిరాజ్‌ ఎంతో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ముఖ్యంగా ఆసియా కప్‌ 2023లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సిరాజ్‌ ఏకంగా 6 వికెట్లతో చెలరేగాడు. ఆ బౌలింగ్‌ స్టాట్స్‌ సిరాజ్‌ కెరీర్‌లోనే ఉన్నంతగా నిలిచిపోతాయి. ఆ మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసిన సిరాజ్‌.. కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి.. 6 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్‌ దెబ్బకు ఆ మ్యాచ్‌లో లంక కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. మరి ఒక టాలెంట్‌ క్రికెటర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక స్థాయికి వెళ్తున్న సిరాజ్‌ను తెలంగాణ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం, ఇంటి స్థలం ఇచ్చి గౌరవించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments