Nidhan
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి ఐపీఎల్ ఫ్రాంచైజీలపై సీరియస్ అయ్యాడు. తాము వద్దనుకుంటే వాళ్లను టీమ్స్‌లోకి తీసుకోమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి ఐపీఎల్ ఫ్రాంచైజీలపై సీరియస్ అయ్యాడు. తాము వద్దనుకుంటే వాళ్లను టీమ్స్‌లోకి తీసుకోమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
Nidhan
భారత జట్టు వెటరన్ పేసర్ మహ్మద్ షమి గత కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. వన్డే వరల్డ్ కప్-2023లో గాయపడిన ఈ స్పీడ్‌స్టర్ సర్జరీ తర్వాత హాస్పిటల్ బెడ్‌కు పరిమితం అయ్యాడు. ఇంజ్యురీతో బాధపడుతూనే టీమిండియా కోసం పెయిన్ కిల్లర్స్ తీసుకొని మరీ ప్రపంచ కప్‌లో ఆడాడు షమి. అయితే సర్జరీ అనంతరం క్రికెట్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్-2024తో పాటు టీ20 వరల్డ్ కప్-2024లో కూడా అతడు ఆడలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న షమి రీసెంట్గా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. స్మాల్ రనప్‌తో అతడు బౌలింగ్ వేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇది చూసిన అభిమానులు రియల్ ఛాంపియన్ వస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
షమి త్వరలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా కోలుకున్నాకే అతడు ఆడతాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మూడు ఫార్మాట్లు లేదా కనీసం రెండు ఫార్మాట్లలో రెగ్యులర్‌గా ఆడాలి. కాబట్టి కంప్లీట్ ఫిట్నెస్ సాధించాకే షమి ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. ఈ తరుణంలో భారత క్రికెట్‌తో పాటు ఐపీఎల్ గురించి అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండు ఐపీఎల్ ఫ్రాంచైజీలపై అతడు సీరియస్ అయ్యాడు. తాను ఎంతగా రాణించినా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తనను రీటెయిన్ చేసుకోలేదని అసంతృప్తిని వ్యక్తం చేశాడీ వెటరన్ పేసర్. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌లో ఉన్న షమి.. వచ్చే సీజన్ కోసం ఆ టీమ్ తనను రీటెయిన్ చేయకపోయినా తనకు పోయేదేం లేదన్నాడు.
‘ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఎంత అద్భుతంగా రాణించినా ఆ టీమ్ నన్ను పట్టించుకోలేదు. నాకు మరో అవకాశం ఇవ్వలేదు. పంజాబ్ కింగ్స్ కూడా అదే చేసింది. ఆ జట్టు తరఫున 60 వికెట్లు పడగొట్టా. కానీ నన్ను రీటెయిన్ చేసుకోలేదు. గత రెండేళ్లలో గుజరాత్ తరఫున 48 వికెట్లు తీశా. అయినా కూడా వచ్చే సీజన్ కోసం ఆ ఫ్రాంచైజీ నన్ను రీటెయిన్ చేయకపోతే నేనేం చేయలేను. రీటెయిన్ చేయకపోయినా పట్టించుకోను. ఏ జట్టు నన్ను తీసుకుంటే వాళ్ల తరఫున అదరగొడతా. వికెట్లు తీయమంటే తీస్తా. అది నా పని. మా లాంటి ప్లేయర్లు వద్దనుకుంటే ఇద్దరు, ముగ్గురు మోడల్స్‌ను వెతికి టీమ్‌లో పెట్టుకోండి’ అని షమి చెప్పుకొచ్చాడు. గేమ్ కావాలంటే తన వంటి వాళ్లను తీసుకోవాలని.. క్రికెటర్స్ టీమ్‌లో వద్దంటే మోడల్స్‌ను తీసుకోవాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మరి.. పెర్ఫార్మ్ చేసేవాళ్లను ఫ్రాంచైజీలు రీటెయిన్ చేసుకోకపోవడంపై షమి వేసిన కౌంటర్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
Mohammad Shami “Delhi Capitals didn’t give me a chance,I took 60 wickets for Punjab in three years,they didn’t retain me after that,I took 48 wickets for Gujarat in two years.If you want a performer,then keep me,if you want looks,find two or three models”pic.twitter.com/Qy8F4HSngw
— Sujeet Suman (@sujeetsuman1991) July 20, 2024