SNP
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌గా కోహ్లీని పేర్కొన్న షమీ.. రోహిత్ గురించి కూడా మాట్లాడాడు. మరి షమీ రోహిత్ గురించి ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌గా కోహ్లీని పేర్కొన్న షమీ.. రోహిత్ గురించి కూడా మాట్లాడాడు. మరి షమీ రోహిత్ గురించి ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
SNP
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీమ్‌కి రెండు కళ్లలాంటి వాళ్లు. సీనియర్ క్రికెటర్లుగా ఇద్దరూ టీమ్‌ను ముందుండి నడిపిస్తున్నారు. మాజీ కెప్టెన్‌గా కోహ్లీ, ప్రస్తుతం కెప్టెన్ రోహిత్.. తమదైన ముద్రను భారత క్రికెట్‌పై వేశారు. సచిన్ రికార్డుల వేటతో పాటు టీమిండియాను గెలిపించే పనిలో కోహ్లీ ఉంటే.. కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపిస్తూ.. తన కెప్టెన్సీలో ఒక్కటైన ఐసీసీ ట్రోఫీ కొట్టాలనే పట్టుదలతో రోహిత్ ఉన్నాడు. ఇలా ఇద్దరూ ఇండియన్ క్రికెట్‌కు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ వారిద్దరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, సూపర్‌స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్ అంటూ షమీ కితాబిచ్చాడు. ఇప్పటికే కోహ్లీ అనేక రికార్డులను బద్దలుకొట్టాడని, అతనే ప్రపంచపు అత్యుత్తమ బ్యాటర్ అని పేర్కొన్నాడు. అలాగే రోహిత్ శర్మ గురించి కూడా మాట్లాడుతూ.. కోహ్లీ బెస్ట్ బ్యాటర్ అయితే.. రోహిత్ మోస్ట్ డేంజరస్ బ్యాటర్ అన్నాడు. ప్రస్తుతం షమీ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి ఆడుతున్న ఆటగాడిగా, వారిని చాలా దగ్గరగా, వాళ్ల బ్యాటింగ్ స్కిల్స్ చూసిన షమీ.. ఈ విధమైన కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మిగిలిన మూడు టెస్టులకు సైతం షమీ అందుబాటులో ఉండటం లేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా షమీ రీఎంట్రీకి ఇంకా టైమ్ పట్టే అవకాశం ఉంది. ఇటీవల వన్డే వరల్డ్ కప్ 2023లో షమీ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అలాగే కోహ్లీ కమ్‌బ్యాక్‌పై కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. మరి మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉంటాడా? లేడా అన్నది ఇంకా తెలియరాలేదు. మరోవైపు కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అవుతున్న రోహిత్.. బ్యాటర్‌గా మాత్రం టెస్ట్ సిరీస్‌లో విఫలం అవుతున్నాడు. మూడో టెస్ట్‌లోనైనా ఫామ్‌లోకి వస్తాడేమో చూడాలి. మరి కోహ్లీ, రోహిత్ గురించి షమీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mohammad Shami said, “Virat Kohli is the best batsman in the world. Virat has just broken a lot of records. I feel Virat is the best and Rohit Sharma is the most dangerous batter in the world”. (News18). pic.twitter.com/NGPl0lr8FR
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 7, 2024