iDreamPost
android-app
ios-app

Gujarat Titans: దాన్ని సరిదిద్దుకోలేదు.. IPL 2024లో గుజరాత్ ఓటములకు అదే కారణం: మహ్మద్ షమీ

  • Published May 14, 2024 | 4:03 PM Updated Updated May 14, 2024 | 4:03 PM

గుజరాత్ వైఫల్యానికి ప్రధాన కారణం ఏంటో చెప్పుకొచ్చాడు ఆ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమీ. ఆ తప్పును సరిదిద్దుకోలేకపోవడమే టీమ్ ను దెబ్బతీసిందని వ్యాఖ్యానించాడు. మరి గుజరాత్ చేసిన తప్పేంటి? తెలుసుకుందాం పదండి.

గుజరాత్ వైఫల్యానికి ప్రధాన కారణం ఏంటో చెప్పుకొచ్చాడు ఆ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమీ. ఆ తప్పును సరిదిద్దుకోలేకపోవడమే టీమ్ ను దెబ్బతీసిందని వ్యాఖ్యానించాడు. మరి గుజరాత్ చేసిన తప్పేంటి? తెలుసుకుందాం పదండి.

Gujarat Titans: దాన్ని సరిదిద్దుకోలేదు.. IPL 2024లో గుజరాత్ ఓటములకు అదే కారణం: మహ్మద్ షమీ

గుజరాత్ టైటాన్స్.. 2022 ఐపీఎల్ సీజన్ తో ఈ టోర్నీలోకి అడుగుపెట్టి, తొలి ఏడాదో టైటిల్ ను సొంతం చేసుకుని అందరిని షాక్ కు గురిచేసింది. ఇక ఆ తర్వాత సీజన్ లో సైతం ఫైనల్ వరకు వెళ్లి రన్నరప్ గా నిలిచి.. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. వరుసగా రెండుసార్లు ఫైనల్ కు వెళ్లిన గుజరాత్.. ఈ ఐపీఎల్ సీజన్ లో మాత్రం దారుణ ప్రదర్శన చేసింది. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్ ల్లో 5 గెలిచి, 7 ఓడిపోయి.. ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో గుజరాత్ వైఫల్యానికి ప్రధాన కారణం ఏంటో చెప్పుకొచ్చాడు ఆ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమీ. ఆ తప్పును సరిదిద్దుకోలేకపోవడమే టీమ్ ను దెబ్బతీసిందని వ్యాఖ్యానించాడు. మరి గుజరాత్ చేసిన తప్పేంటి?

ఐపీఎల్ 2024 నుంచి గుజరాత్ టైటాన్స్ నిష్క్రమించింది. నిన్న కోల్ కత్తాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. గుజరాత్ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో.. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దాంతో జీటీ కథ ముగిసింది. గత సీజన్లలో వరుసగా రెండు సార్లు ఫైనల్ చేసిన గుజరాత్.. ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ వెళ్లకుండానే నిష్క్రమించింది. అయితే ఈ సీజన్ లో జట్టు వైఫల్యాన్ని కారణం అదే నంటూ, దానికి సరిదిద్దుకోకపోవడంతోనే ఇలా జరిగిందని చెప్పుకొచ్చాడు ఆ జట్టు స్టార్ పేసర్, టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ.

గుజరాత్ ఓటముల గురించి మహ్మద్ షమీ మాట్లాడుతూ..”గుజరాత్ ఓటములకు ప్రధాన కారణం ఓపెనింగ్ జోడీ. అవును కెప్టెన్ శుబ్ మన్ గిల్-వృద్ధిమాన్ సాహా ఇద్దరూ ఈ టోర్నీలో మంచి భాగస్వామ్యాలు అందించడంలో పూర్తిగా విఫలం అయ్యారు. ఏ మ్యాచ్ లో కూడా ఈ జోడీ మెరుపు ఆరంభాలు ఇవ్వకపోగా.. సరైన పార్ట్ నర్ షిప్ ను అందించలేకపోయారు. ఈ తప్పును వారు సరిదిద్దుకోలేకపోయారు. ఇక వీరితో పాటుగా మిగతా బ్యాటర్లు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అందుకే గుజరాత్ ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది”  అంటూ విశ్లేషించాడు మహ్మద్ షమీ.

కాగా.. షమీ వ్యాఖ్యలు అక్షరాలా నిజం. గత సీజన్ లో గిల్ 17 మ్యాచ్ లు ఆడి 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. కానీ ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ ల్లో 426 రన్స్ మాత్రమే చేశాడు. అదీకాక ఓపెనర్లు గా గిల్-సాహాలు పూర్తిగా విఫలం అయ్యారు. వీరిద్దరు ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ లో కూడా 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయలేదంటేనే అర్ధం అవుతోంది. ఇక 9 మ్యాచ్ ల్లో ఓపెనింగ్ చేసిన సాహా కేవలం 136 రన్స్ మాత్రమే చేశాడు. మరి గుజరాత్ వైఫల్యానికి కారణం ఓపెనింగ్ జోడీ ఫెయిల్యూరే అన్న మహ్మద్ షమీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.