iDreamPost
android-app
ios-app

Mohammed Shami: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. ఆసీస్ కు వార్నింగ్ ఇచ్చిన మహ్మద్ షమీ!

  • Published Sep 15, 2024 | 2:43 PM Updated Updated Sep 15, 2024 | 2:43 PM

Mohammed Shami said Australia should be afraid of Team India: త్వరలోనే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియా జట్టుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

Mohammed Shami said Australia should be afraid of Team India: త్వరలోనే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియా జట్టుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

Mohammed Shami: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. ఆసీస్ కు వార్నింగ్ ఇచ్చిన మహ్మద్ షమీ!

టీమిండియా మరికొన్ని రోజుల్లో కీలకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఇక ఈ సిరీస్ కోసం ఆసీస్-ఇండియా జట్లు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ఆసీస్ మాజీ ప్లేయర్లు ఈ సిరీస్ గురించి తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. ఈ ట్రోఫీలో తమ జట్టే ఫేవరెట్ అని చెబుతూ.. భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ప్లాన్స్ వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆసీస్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ సిరీస్ గెలవబోయేది మేమే అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం నవంబర్ లో ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరగనున్న ఈ టోర్నీని ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ సిరీస్ ను గెలుచుకుని టెస్ట్ ఛాంపియన్ షిప్ లో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నాయి. అయితే 2014 తర్వాత ఒక్కసారైనా ఈ ట్రోఫీని ఆసీస్ గెలుచుకోలేకపోయింది. దాంతో ఈసారి ఎలాగైనా ఈ సిరీస్ ను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. అయితే అదంత ఈజీ కాదని, ఈసారి కూడా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని మేమే గెలుచుకోబోతున్నాం అంటూ ధీమా వ్యక్తం చేశాడు భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ.

క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(CAB) వార్షిక అవార్డుల వేడుకల్లో పాల్గొన్నాడు మహ్మద్ షమీ. ఈ సందర్భంగా అతడికి ఓ ప్రశ్న ఎదురైంది. ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎవరు గెలుస్తారు? అన్న ప్రశ్నకు షమీ తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు. “ఈ ట్రోఫీలో మేమే ఫేవరెట్స్.. కచ్చితంగా మేమే గెలుస్తాం. ఇక భయపడాల్సింది ఆస్ట్రేలియా జట్టే. ఎందుకంటే? ప్రస్తుతం మా అద్భుతంగా ఆడుతోంది. టీమ్ లో ఎంతో మంది నైపుణ్యం గల యువ ఆటగాళ్లు, సీనియర్లు ఉన్నారు. ఇక బుమ్రా లాంటి బౌలర్ ఉండటం మాకు అదనపు బలం. ఇవన్నీ చూస్తే.. ఈ సిరీస్ మేమే సాధిస్తాం అని కచ్చితంగా చెప్పగలను” అంటూ మహ్మద్ షమీ ఒక విధంగా ఆసీస్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఇక చీల మండల గాయం నుంచి పూర్తిగా కోలుకున్న షమీ ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే 100 శాతం ఫిట్ గా ఉన్నానని తెలిసిన తర్వాతే జట్టులోకి వస్తానని ఈ సందర్భంగా వెల్లడించాడు. పూర్తి ఫిట్ నెస్ సాధించకుండా టీమ్ లోకి వస్తే.. మళ్లీ గాయపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. మరి షమీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.