iDreamPost
android-app
ios-app

Shimron Hetmyer: సహనం కోల్పోయిన జోసెఫ్.. బుద్దిచెప్పిన హెట్మేయర్! చూసి తీరాల్సిన వీడియో..

  • Published Sep 15, 2024 | 1:15 PM Updated Updated Sep 15, 2024 | 1:15 PM

Alzarri Joseph, shimron hetmyer: కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అల్జారీ జోసెఫ్, షిమ్రోన్ హెట్మేయర్ మధ్య మినీ యుద్ధమే జరిగింది. సహనం కోల్పోయిన జోసెఫ్ కు హెట్మేయర్ ఎలా బుద్ది చెప్పాడో ఇప్పుడు చూద్దాం.

Alzarri Joseph, shimron hetmyer: కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అల్జారీ జోసెఫ్, షిమ్రోన్ హెట్మేయర్ మధ్య మినీ యుద్ధమే జరిగింది. సహనం కోల్పోయిన జోసెఫ్ కు హెట్మేయర్ ఎలా బుద్ది చెప్పాడో ఇప్పుడు చూద్దాం.

  • Published Sep 15, 2024 | 1:15 PMUpdated Sep 15, 2024 | 1:15 PM
Shimron Hetmyer: సహనం కోల్పోయిన జోసెఫ్.. బుద్దిచెప్పిన హెట్మేయర్! చూసి తీరాల్సిన వీడియో..

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరిగేటప్పుడు ఆటగాళ్లు సహనం కోల్పుతుంటారు. ఈ విషయంలో ముఖ్యంగా కెప్టెన్లు ముందుంటారు. ఆటగాళ్లు క్యాచ్ లు మిస్ చేస్తే.. సదరు కెప్టెన్ తన నోటికి పనిచెబుతుంటాడు. అలాగే కొంత మంది బౌలర్లు బ్యాటర్లను కవ్విస్తుంటారు. దానికి తగ్గట్లుగానే కౌంటర్ ఇస్తుంటారు బ్యాటర్లు. ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అల్జారీ జోసెఫ్, షిమ్రోన్ హెట్మేయర్ మధ్య మినీ యుద్ధమే జరిగింది. సహనం కోల్పోయిన జోసెఫ్ కు హెట్మేయర్ ఎలా బుద్ది చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.

కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్ వర్సెస్ గయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సెయింట్ లూసియా కింగ్స్ విధించిన 101 పరుగుల టార్గెట్ ను 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది గయానా వారియర్స్. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఇంట్రెస్టింగ్ ఘటన చోటు చేసుకుంది. వారియర్స్ విజయానికి 9 పరుగులు అవసరం అయిన నేపథ్యంలో బౌలింగ్ కు దిగాడు అల్జారీ జోసెఫ్. క్రీజ్ లో షిమ్రోన్ హెట్మేయర్, హోప్ ఉన్నారు. ఈ క్రమంలోనే జోసెఫ్ వేసిన బంతిని నేరుగా అతడి వైపునకే కొట్టాడు. ఇక బాల్ అందుకున్న జోసెఫ్ సహనం కోల్పోయి హెట్మేయర్ క్రీజ్ లోనే ఉన్నప్పటికీ.. బంతిని కావాలనే గట్టిగా అతడి వైపు విసిరాడు. పైగా హెట్మేయర్ వైపు కోపంగా చూశాడు కూడా.

దాంతో.. ఇక ఇంత పనికి వచ్చావా?  అనుకున్నాడో ఏమో.. ఆ తర్వాత బంతిని భారీ సిక్సర్ గా మలిచి జోసెఫ్ కు తగిన బుద్దిచెప్పాడు హెట్మేయర్. దాంతో గయానా విజయం ఖాయం అయిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఓడిపోతున్నాం అనే బాధలో జోసెఫ్ సహనం కోల్పోయి బంతిని కావాలనే బలంగా అతడిపైకి విసిరాడు. దాంతో తర్వాత బంతినే సిక్సర్ గా బాది బుద్ది చెప్పాడు హెట్మేయర్. యాక్షన్ కు రియాక్షన్ అదిరిపోయిందని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbahisabi girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom