గొప్ప మనసు.. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన షమీ! వైరల్ వీడియో..

  • Author Soma Sekhar Published - 11:04 AM, Sun - 26 November 23

మహ్మద్ షమీ తన గొప్ప మనసును చాటుకుని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన వీడియోను షమీ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

మహ్మద్ షమీ తన గొప్ప మనసును చాటుకుని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన వీడియోను షమీ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

  • Author Soma Sekhar Published - 11:04 AM, Sun - 26 November 23

‘గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు’ అన్న డైలాగ్ ఇప్పుడు అచ్చంగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి సరిపోతుంది. తాజాగా జరిగిన వరల్డ్ కప్ లో సంచలన ప్రదర్శన చేసి.. భారత జట్టు తరఫున హీరోగా నిలిచాడు. టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ.. షమీ ఆటపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. ప్రస్తుతం మరోసారి అతడు చేసిన గొప్ప పనికి పొగడ్తలు అందుకుంటున్నాడు. తన మంచి మనసు చాటుకుని ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహ్మద్ షమీ తన మంచి మనసు చాటుకుని.. ఓ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే.. మహ్మద్ షమీ శనివారం ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ కు తన కారులో ప్రయాణిస్తున్నాడు. అయితే మార్గంమధ్యలో తన ముందు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు కొండపై నుంచి కిందకి దూసుకెళ్లింది. ఇది చూసిన షమీ, తన కారును పక్కకు ఆపి మరికొందరి సాయంతో కారులో చిక్కుకున్న వ్యక్తిని సమయానికి బయటకు తీశాడు. సదరు వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో.. అక్కడే ప్రదమ చికిత్సను కూడా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను షమీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. “ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు. నిజంగా ఆ దేవుడు అతడికి పునర్జన్మను ఇచ్చాడు. నేను నైనిటాల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో కొంత మంది సాయం తీసుకుని అతడిని సురక్షితంగా బయటకి తీశాం” అంటూ రాసుకొచ్చాడు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో.. షమీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భాయ్ మీరు నిజంగా గ్రేట్, మరోసారి మీ మంచి మనసు చాటుకున్నారు అంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. తెలిసిన వ్యక్తులకు ప్రమాదం జరిగితే పట్టించుకోని ఈ రోజుల్లో మీరు ఇలా తెలియని ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడటం నిజంగా గొప్ప విషయమని మరికొందరు పొగడ్తలు కురిపించారు. కాగా.. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో షమీ సంచలన ప్రదర్శన ఇచ్చాడు. లేట్ గా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్ గా మోస్ట్ వికెట్ టేకర్ గా నిలిచి ఔరా అనిపించాడు. ఈ మెగాటోర్నీలో కేవలం 7 మ్యాచ్ ల్లోనే 24 వికెట్లు పడగొట్టి అందరి మన్ననలు పొందాడు. మరి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన షమీ గొప్ప మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments