Mohammed Shami: రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన షమి.. ముందు ఆ టీమ్​కు ఆడతానంటూ..!

వెటరన్ పేసర్ మహ్మద్ షమి రీఎంట్రీ కోసం రెడీ అవుతున్నాడు. మోకాలి గాయంతో టీమిండియాకు దూరమైన అతడు.. కొన్నాళ్ల కింద సర్జరీ చేయించుకున్నాడు.

వెటరన్ పేసర్ మహ్మద్ షమి రీఎంట్రీ కోసం రెడీ అవుతున్నాడు. మోకాలి గాయంతో టీమిండియాకు దూరమైన అతడు.. కొన్నాళ్ల కింద సర్జరీ చేయించుకున్నాడు.

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమి క్రికెట్​ గ్రౌండ్​లో సందడి చేసి చాన్నాళ్లు అయింది. వన్డే వరల్డ్ కప్-2023 టైమ్​లో అతడి మోకాలికి గాయమైంది. అయితే దేశం కోసం నొప్పిని భరిస్తూ పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఆటను కొనసాగించాడు షమి. ఆ తర్వాత గాయానికి ట్రీట్​మెంట్ కోసమని వెళ్తే సర్జరీ చేయాల్సిందేనన్నారు వైద్యులు. దీంతో ఆపరేషన్ చేయించుకొని కొన్నాళ్లు ఆస్పత్రి మంచానికే పరిమితం అయ్యాడు. క్రమంగా కోలుకున్న అతడు ఈ మధ్యే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్స్​లో స్మాల్ రనప్​తో షమి బౌలింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మొత్తానికి ఆరు నెలల తర్వాత మళ్లీ గ్రౌండ్​లోకి దిగనున్నాడీ వెటరన్ స్పీడ్​స్టర్.

రీఎంట్రీపై షమి క్లారిటీ ఇచ్చాడు. మళ్లీ గ్రౌండ్​లోకి దిగి టీమిండియా తరఫున బౌలింగ్ చేసే క్షణాల కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు. అయితే ముందు భారత్​కు కాదు.. ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని అన్నాడు. డొమెస్టిక్ క్రికెట్​లో బెంగాల్ టీమ్​ తరఫున బరిలోకి దిగుతానని.. ఆ తర్వాతే మెన్ ఇన్ బ్లూకు ఆడతానని తెలిపాడు. నేషనల్ టీమ్​లోకి సరిగ్గా ఎప్పుడు వస్తాననేది ఇప్పుడు చెప్పలేనని.. అందుకోసం తీవ్రంగా సాధన చేస్తున్నానని పేర్కొన్నాడు షమి. ఫిట్​నెస్​ మీద ఫోకస్ పెట్టానని.. భారత జెర్సీని ధరించే ముందు బెంగాల్ తరఫున మూడ్నాలుగు మ్యాచులు ఆడతానన్నాడు.

‘భారత జట్టులోకి ఎప్పుడు తిరిగొస్తానో ఇప్పుడే చెప్పలేను. అందుకోసం తీవ్రంగా సాధన చేస్తున్నా. టీమిండియా జెర్సీ వేసుకోవడానికి ముందు బెంగాల్ తరఫున గ్రౌండ్​లోకి దిగుతా. కంప్లీట్​గా ప్రిపేర్ అయ్యేందుకు కనీసం మూడ్నాలుగు మ్యాచులు ఆడేందుకు ప్రయత్నిస్తా. వన్డే వరల్డ్ కప్ టైమ్​లో అయిన గాయం ఇంత తీవ్రస్థాయికి వెళ్తుందని నేను ఊహించలేదు. మెగాటోర్నీ ముగిశాక ఐపీఎల్ ఉంటుంది. అందులో ఆడితే టీ20 ప్రపంచ కప్ కోసం సన్నద్ధమవ్వొచ్చని అనుకున్నా. కానీ ఇంజ్యురీ కాస్తా సర్జరీ వరకు వెళ్లింది. దీని తీవ్రత ముందే పసిగడితే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు. సర్జరీ అనంతరం డాక్టర్స్ కూడా రికవరీకి సమయం పడుతుందని చెప్పారు’ అని షమి వివరించాడు. మరి.. ఈ స్టార్ పేసర్ రీఎంట్రీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments