iDreamPost
android-app
ios-app

ఫ్యూచర్​లో టీమిండియాను మొత్తం మార్చేస్తాం.. మా ప్లాన్ అదే: బౌలింగ్ కోచ్

  • Published Aug 03, 2024 | 6:10 PM Updated Updated Aug 03, 2024 | 6:10 PM

Sairaj Bahutule: టీమిండియా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇకపై జట్టు ఎలా ఆడుతుంది? అనేది రివీల్ చేశాడు బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే. మన జట్టును చూసి వాళ్లు వణికేలా చేయాలని అనుకుంటున్నామని చెప్పాడు.

Sairaj Bahutule: టీమిండియా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇకపై జట్టు ఎలా ఆడుతుంది? అనేది రివీల్ చేశాడు బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే. మన జట్టును చూసి వాళ్లు వణికేలా చేయాలని అనుకుంటున్నామని చెప్పాడు.

  • Published Aug 03, 2024 | 6:10 PMUpdated Aug 03, 2024 | 6:10 PM
ఫ్యూచర్​లో టీమిండియాను మొత్తం మార్చేస్తాం.. మా ప్లాన్ అదే: బౌలింగ్ కోచ్

కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ రాకతో టీమిండియాలో అనేక మార్పులు జరుగుతున్నాయి. టీ20లకు కొత్త కెప్టెన్​గా సూర్యకుమార్ యాదవ్​ను నియమించారు. టీ20లు, వన్డేలకు యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్​ను వైస్ కెప్టెన్ చేశారు. సూర్యను కేవలం పొట్టి ఫార్మాట్​కు మాత్రమే పరిమితం చేశారు. గంభీర్ కోచింగ్​లో లంకతో జరిగిన టీ20 సిరీస్​ను భారత్ 3-0 తేడాతో క్లీన్​స్వీప్ చేసింది. వన్డే సిరీస్​లో తొలి మ్యాచ్​ను టై చేసింది. గౌతీ కోచింగ్​లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్​లో దూకుడుగా కనిపిస్తోంది. ఆటగాళ్లందరికీ ఎవరి రోల్స్​ ఏంటో వాళ్లకు వివరించి అదే చేయిస్తున్నాడు గంభీర్. అలాగే చేయి తిప్పగలిగే బ్యాటర్లతో కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయిస్తూ ఆరో బౌలర్​ లోటు కనిపించకుండా చూసుకుంటున్నాడు.

ఫస్ట్ టూర్​తోనే టీమిండియాపై తనదైన ముద్ర వేస్తున్న గంభీర్.. భవిష్యత్తులో ఇంకా జట్టులో ఏమేం మార్పులు తీసుకొస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై టెంపరరీ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే రియాక్ట్ అయ్యాడు. భారత మేనేజ్​మెంట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇకపై జట్టు ఎలా ఆడుతుంది? అనేది రివీల్ చేశాడు బహుతులే. మన జట్టును చూసి అన్ని జట్లు వణికేలా చేయాలని అనుకుంటున్నామని చెప్పాడు. టీమిండియా బ్యాటర్లలో బౌలింగ్ చేసే టాలెంట్ కూడా ఉందని.. దాన్ని మరింత సానబెట్టే పనిలో ఉన్నామని తెలిపాడు. భవిష్యత్తులో టీమిండియాను మార్చేస్తామని.. ఆల్​రౌండ్​ జట్టుగా తీర్చిదిద్దాలనేది టీమ్ మేనేజ్​మెంట్ ప్లాన్ అని పేర్కొన్నాడు.

‘భారత జట్టు బ్యాటర్లకు మంచి బౌలింగ్ టాలెంట్ కూడా ఉంది. వాళ్ల ప్రైమరీ స్కిల్ బ్యాటింగ్. అందువల్లే బౌలింగ్ మీద ఫోకస్ పెట్టేంత టైమ్ వాళ్లకు దొరకలేదు. కానీ వాళ్లు సాధన చేస్తే బౌలింగ్​లోనూ అదరగొట్టగలరు. టాపార్డర్ బ్యాటర్లలో ఒకరిద్దరు బౌలింగ్ చేస్తే అది టీమ్​కు బిగ్ ప్లస్ అవుతుంది. అయితే పిచ్ కండీషన్స్, మ్యాచ్ సిచ్యువేషన్స్​ను బట్టే వాళ్లకు బౌలింగ్ ఇవ్వాలా? వద్దా? అనేది డిసైడ్ చేస్తాం. ఫ్యూచర్​లో బ్యాటర్లకు బౌలింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. వైట్ బాల్ క్రికెట్ అనేది క్రమంగా ఆల్​రౌండర్స్ గేమ్​గా మారుతోంది. అందుకే మన జట్టును కూడా అదే విధంగా తీర్చిదిద్దుతున్నాం. బ్యాటర్ వచ్చి బౌలింగ్ చేస్తే అది అపోజిషన్ టీమ్స్​కు కూడా సర్​ప్రైజ్​గా మారుతుంది’ అని బహుతులే చెప్పుకొచ్చాడు. మరి.. టీమిండియాలో ఆల్​రౌండర్లను పెంచే ప్రయత్నం సక్సెస్ అవుతుందని మీరు భావిస్తున్నారా? మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.