iDreamPost
android-app
ios-app

48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్ర తిరగరాసిన షమీ.. తొలి బౌలర్ గా!

  • Author Soma Sekhar Updated - 03:02 PM, Thu - 16 November 23

న్యూజిలాండ్ తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో 7 వికెట్లతో సంచలన బౌలింగ్ చేసిన షమీ 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రను తిరగరాశాడు. ఎవ్వరికీ సాధ్యంకాని రికార్డును తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఆ రికార్డుల వివరాల్లోకి వెళితే..

న్యూజిలాండ్ తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో 7 వికెట్లతో సంచలన బౌలింగ్ చేసిన షమీ 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రను తిరగరాశాడు. ఎవ్వరికీ సాధ్యంకాని రికార్డును తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఆ రికార్డుల వివరాల్లోకి వెళితే..

  • Author Soma Sekhar Updated - 03:02 PM, Thu - 16 November 23
48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్ర తిరగరాసిన షమీ.. తొలి బౌలర్ గా!

వన్డే ప్రపంచ కప్ 2023లో భీకర ఫామ్ లో ఉన్న టీమిండియా సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇక వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. తాజాగా వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో 70 పరుగులతో విజయం సాధించి.. ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక తొలుత కివీస్ పట్టుబిగించిన ఈ మ్యాచ్ లో తన అద్భుతమైన బౌలింగ్ తో టీమిండియాకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 7 వికెట్లతో సంచలన బౌలింగ్ చేసిన షమీ 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రను తిరగరాశాడు. ఎవ్వరికీ సాధ్యంకాని రికార్డును తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఆ రికార్డుల వివరాల్లోకి వెళితే..

మహ్మద్ షమీ.. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో ఊహించని రీతిలో చెలరేగిపోతున్నాడు ఈ స్టార్ బౌలర్. తాజాగా కివీస్ తో జరిగిన తొలి సెమీఫైనల్లో 7 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. దీంతో చివరి వరకు ఉత్కంఠతను క్రియేట్ చేస్తుంది అనుకున్న మ్యాచ్ ను కాస్త టీమిండియాకు విజయానికి అనుకూలంగా మార్చాడు. ఈ క్రమంలోనే షమీ 48 సంవత్సరాల ప్రపంచ కప్ చరిత్రలో దిగ్గజాలకు ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును కేవలం 17 వరల్డ్ కప్ ఇన్నింగ్స్ ల్లోనే సాధించాడు. ఓవరాల్ గా వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల హాల్స్ నమోదు చేసిన తొలి బౌలర్ గా ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఇప్పటి వరకు షమీ వన్డే ప్రపంచ కప్ టోర్నీల్లో 4 సార్లు 5 వికెట్లు తీశాడు. కేవలం 17 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత సాధించి.. ఔరా అనిపించాడు ఈ మేటి బౌలర్. ఈ వరల్డ్ కప్ లోనే 3 సార్లు ఐదు వికెట్లు తీయడం విశేషం. 2019లో కూడా షమీ ఓసారి ఐదు వికెట్లు సాధించాడు. ఇక ఇంతకు ముందు ఈ ఘనత ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది. అతడు 26 ఇన్నింగ్స్ ల్లో 3 సార్లు 5 వికెట్లు సాధించాడు. తాజాగా ఈ రికార్డును బ్రేక్ చేశాడు టీమిండియా స్టార్ పేసర్. ఈ రికార్డులతో పాటుగా అంతర్జాతీయ వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ గా స్టువర్ట్ బిన్నీ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. బిన్నీ 2014లో బంగ్లాదేశ్ పై 4 రన్స్ కే 6 వికెట్లు పడగొట్టాడు.

ఇక ఈ మ్యాచ్ లో 57 రన్స్ ఇచ్చిన షమీ 7 వికెట్లు తీసి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లు సెంచరీలతో చెలరేగారు. అనంతరం 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ను డార్లీ మిచెల్(134) భారీ శతకంతో విజయం వైపు నడిపించినా.. షమీ అద్భుతమైన బౌలింగ్ తో టీమిండియాకు 70 పరుగుల విజయాన్ని కట్టబెట్టాడు. మరి షమీ సాధించిన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.