iDreamPost
android-app
ios-app

మహ్మద్ షమి అరుదైన ఘనత.. వరల్డ్ కప్​ హిస్టరీలోనే..!

భారత్ స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ వన్డే వరల్డ్ కప్ లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లు పడగొట్టి విశ్వరూపం ప్రదర్శించాడు షమీ.

భారత్ స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ వన్డే వరల్డ్ కప్ లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లు పడగొట్టి విశ్వరూపం ప్రదర్శించాడు షమీ.

మహ్మద్ షమి అరుదైన ఘనత.. వరల్డ్ కప్​ హిస్టరీలోనే..!

వన్డే ప్రపంచకప్ లో టీమిండియా సంచలన విజయాలను నమోదు చేస్తోంది. పోటీ ఏ టీమ్ తో అయినా సరే మాకు మేమే పోటీ, మాకు మేమే సాటి అన్నట్లుగా తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది రోహిత్ సేన. వరల్డ్ కప్ లో భాగంగా నేడు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన భారత్, శ్రీలంక మ్యాచ్ లో బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో అదరగొట్టిన టీమిండియా లంకను మట్టికరిపించింది. 302 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్ మహమ్మద్ షమీ అరుదైన రికార్డును నెలకొల్పాడు. వరల్డ్ కప్ హిస్ట్రీలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.

భారత్ స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ వన్డే వరల్డ్ కప్ లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లు పడగొట్టి విశ్వరూపం ప్రదర్శించాడు షమీ. శ్రీలంక బ్యాటర్లైన అసలంక, మాథ్యూస్, హేమంత్, చమీర, రజిత ల వికెట్లు పడగొట్టడంతో వన్డే చరిత్రలో భారత్ తరఫున అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా షమీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో ఐదు ఓవర్లు వేసిన షమీ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్ లో 5 వికెట్లతో చెలరేగిన షమీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ ఇప్పటివరకు వరల్డ్‌కప్‌ టోర్నీల్లో 45 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత బౌలింగ్‌ దిగ్గజాలు జహీర్‌ ఖాన్‌, జవగాల్‌ శ్రీనాథ్‌ను షమీ అధిగమించాడు. వరల్డ్ కప్ టోర్నీల్లో 14 ఇన్నింగ్స్ లల్లో 45 వికెట్లు తీసి టాప్ ప్లేస్ లో ఉన్నాడు షమీ. ఈ క్రమంలో జహీర్ ఖాన్ 23 ఇన్నింగ్స్ లో 44 వికెట్లు, జవగల్ శ్రీనాథ్ 33 ఇన్నింగ్స్ లో 44 వికెట్లు పడగొట్టి తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షమీ 14 వి​కెట్లు పడగొట్టాడు. అందులో రెండు మ్యాచ్ లలో ఐదు వికెట్లు, ఒక మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టి విజృంభించాడు.