వీడియో: సచిన్‌ వర్సెస్‌ రిజ్వాన్‌! సెంచరీ చేసినా తప్పని ట్రోలింగ్‌!

Mohammad Rizwan, Upper Cut, PAK vs BAN, Sachin Tendulkar: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రిజ్వాన్‌ సెంచరీ చేసినా.. అతనిపై ట్రోలింగ్‌ జరుగుతోంది. అందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Mohammad Rizwan, Upper Cut, PAK vs BAN, Sachin Tendulkar: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రిజ్వాన్‌ సెంచరీ చేసినా.. అతనిపై ట్రోలింగ్‌ జరుగుతోంది. అందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ తాజాగా సెంచరీ చేసి కూడా ట్రోలింగ్‌కి గురవుతున్నాడు. స్వదేశంలో రావాల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రిజ్వాన్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఆట తొలి రోజు బ్యాటింగ్‌కు వచ్చిన రిజ్వాన్‌ రెండో రోజు కూడా సూపర్‌ బ్యాటింగ్‌తో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం 150కి పైగా పరుగులు చేసి.. డబుల్‌ సెంచరీ దిశగా అడుగులేస్తున్నాడు. అయితే.. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకునే సమయంలో.. రిజ్వాన్‌ ఆడిన ఓ అప్పర్‌ కట్‌ షాట్‌తో సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురువుతున్నాడు. అందుకు కారణం.. ఆ షాట్‌ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండ్కూలర్‌ ట్రేడ్‌ మార్క్‌ షాట్‌ను పోలీ ఉండటమే.

ది గ్రేట్‌ సచిన్‌ టెండూల్కర్‌ ట్రేడ్‌ మార్క్‌ షాట్లలో ముందుగా స్ట్రేట్‌ డ్రైవ్‌, ఆ తర్వాత.. అప్పర్‌ కట్‌ షాట్లు ఉంటాయి. తాజాగా రిజ్వాన్‌ కూడా.. 46 పరుగుల వద్ద ఉన్న సమయంలో బంగ్లాదేశ్‌ బౌలర్ నహీద్‌ రాణా వేసిన ఇన్నింగ్స్‌ 53వ ఓవర్‌ మూడో బంతిని రిజ్వాన్‌ అప్పర్‌ కట్‌ ఆడాడు. బాడీ పైకి వస్తున్న షార్ట్‌ బాల్‌ను వెనక్కి బెండ్‌ అవుతూ.. థర్డ్‌మ్యాన్‌ వైపు ఫైన్‌గా ఆడాడు. బాల్‌ కూడా బౌండరీకి వెళ్లింది. ఆ షాట్‌తో రిజ్వాన్‌ హాఫ్‌ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. కానీ, షాట్‌ ఆడిన తర్వాత బాడీ బ్యాలెన్స్‌ ఆపుకోలేకపోయాడు. షాట్‌ ఆడి కిందపడిపోయాడు.

అయితే.. కొంతమంది క్రికెట్‌ అభిమానులు రిజ్వాన్‌ ఆడిన షాట్‌ను.. సచిన్‌ అప్పర్‌ కట్‌ ఆడుతున్న ఫొటోలను పక్కపక్కన పెట్టి.. సేమ్‌ టూ సేమ్‌ అంటున్నారు. వీటిపై సచిన్‌ అభిమానులు రియాక్ట్‌ అవుతూ.. ‘పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు’, రిజ్వాన్‌ షాక్‌కి, సచిన్‌ షాట్‌కి ‘నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా’ ఉందని అంటున్నారు. ఎందుకంటే.. సచిన్‌ అప్పర్‌ కట్‌ ఆడితే.. ఎంత బ్యాలెన్సింగ్‌గా, పర్ఫెక్ట్‌గా, అందగా ఆడతాడు. కానీ, రిజ్వాన్‌ మాత్రం.. షాట్‌ అయితే ట్రై చేశాడు కానీ బ్యాలెన్స్‌ ఆపుకోలేకపోయాడు.. ఏదైన షాట్‌ ఆడటం గొప్ప కాదు.. పర్ఫెక్ట్‌గా ఆడటం గొప్ప. అందులోనూ.. సచిన్‌ అప్పర్‌ కట్‌ ఆడితే.. ఆ షాట్‌కే అందం వస్తుంది. అలాంటి షాట్‌ను ఒక్కే ఒక్కడు సచిన్‌ మాత్రమే అద్భుతంగా ఆడగలడు.. అలా ఎవరైనా ఆడదాం అనుకుంటే.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే అవుతుందని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments