క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్ ఎంత ముఖ్యమో.. ఫీల్డింగ్ కూడా అంతే ముఖ్యమని చెప్పాలి. ఫీల్డింగ్ బాగున్న టీమ్‌లను ఎదుర్కొని భారీ స్కోర్లు చేయడం అంత ఈజీ కాదు. క్యాచ్‌లు పట్టి, రనౌట్లు చేయగలిగే సత్తా ఉండే ప్లేయర్లు టీమ్‌లో ఉంటే ఈజీగా 10 నుంచి 30 రన్స్ వరకు నిలువరించొచ్చు. ఫీల్డింగ్ బాగుంటే ఓడిపోయే మ్యాచ్‌లను కూడా గెలవొచ్చు. అందుకే ‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అని క్రికెట్ ఎక్స్ట్పర్ట్స్ అంటుంటారు. దాదాపుగా అన్ని జట్లు తమ ఫీల్డింగ్ ప్రమాణాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయి.
ఇక, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ వన్డేలో టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే మొదటి ఓవర్లోనే ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది. అఫ్గాన్ పేసర్ ఫజలక్ ఫరూఖీ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికే పాక్ ఓపెనర్ ఫకార్ జమాన్ (2) స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే ఫకర్ ఇచ్చిన క్యాచ్ అందుకునే క్రమంలో నాటకీయ పరిణామం జరిగింది. అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి సెకండ్ స్లిప్ వైపు దూసుకెళ్లింది. కానీ సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ప్లేయర్ అలర్ట్‌గా లేకపోవడంతో అతడి చేతులను తాకిన బంతి గాల్లోకి లేవగా.. ఫస్ట్ స్లిప్ ఫీల్డర్ మహమ్మద్ నబీ అందుకున్నాడు.
క్యాచ్‌ను చేజార్చిన ఫీల్డర్ రహ్మత్ షాపై మహమ్మద్ నబీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొద్దిలో క్యాచ్ మిస్సయ్యేది అంటూ అతడిపై సీరియస్ అయ్యాడు. బాల్‌తో రహ్మత్ను కొట్టబోయాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫకర్ తర్వాత కెప్టెన్ బాబర్ ఆజం (0), మహమ్మద్ రిజ్వాన్ (21), అఘా సల్మాన్ (7) వికెట్లను కోల్పోయింది పాక్. 47.1 ఓవర్లలో ఆ జట్టు 201 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. అయితే తక్కువ స్కోరును ఛేదించి పాక్‌కు అఫ్గాన్ షాక్ ఇస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ జట్టు 19.2 ఓవర్లలో 59 రన్స్‌కే ఆలౌట్ అయింది. పాక్ పేసర్ హారిస్ రౌఫ్ ఏకంగా 5 వికెట్లతో సత్తా చాటాడు.
Farooqi strikes! Bright start for Afghanistan as Fakhar Zaman departs in the very first over.
.
.#AFGvPAK pic.twitter.com/sdg8sH0CxM— FanCode (@FanCode) August 22, 2023