iDreamPost
android-app
ios-app

వీడియో: తోటి ప్లేయర్​ను కొట్టబోయిన అఫ్గాన్ ఆల్​రౌండర్ నబీ!

  • Author singhj Published - 04:12 PM, Wed - 23 August 23
  • Author singhj Published - 04:12 PM, Wed - 23 August 23
వీడియో: తోటి ప్లేయర్​ను కొట్టబోయిన అఫ్గాన్ ఆల్​రౌండర్ నబీ!

క్రికెట్​లో బ్యాటింగ్, బౌలింగ్ ఎంత ముఖ్యమో.. ఫీల్డింగ్​ కూడా అంతే ముఖ్యమని చెప్పాలి. ఫీల్డింగ్ బాగున్న టీమ్​లను ఎదుర్కొని భారీ స్కోర్లు చేయడం అంత ఈజీ కాదు. క్యాచ్​లు పట్టి, రనౌట్​లు చేయగలిగే సత్తా ఉండే ప్లేయర్లు టీమ్​లో ఉంటే ఈజీగా 10 నుంచి 30 రన్స్​ వరకు నిలువరించొచ్చు. ఫీల్డింగ్ బాగుంటే ఓడిపోయే మ్యాచ్​లను కూడా గెలవొచ్చు. అందుకే ‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అని క్రికెట్ ఎక్స్ట్​పర్ట్స్ అంటుంటారు. దాదాపుగా అన్ని జట్లు తమ ఫీల్డింగ్ ప్రమాణాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయాన్ని చాలా సీరియస్​గా తీసుకుంటున్నాయి.

ఇక, మూడు వన్డేల సిరీస్​లో భాగంగా అఫ్గానిస్థాన్​తో జరిగిన ఫస్ట్ వన్డేలో టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్​కు దిగింది. అయితే మొదటి ఓవర్​లోనే ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది. అఫ్గాన్ పేసర్ ఫజలక్ ఫరూఖీ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికే పాక్ ఓపెనర్ ఫకార్ జమాన్ (2) స్లిప్​ క్యాచ్​గా వెనుదిరిగాడు. అయితే ఫకర్ ఇచ్చిన క్యాచ్ అందుకునే క్రమంలో నాటకీయ పరిణామం జరిగింది. అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి సెకండ్ స్లిప్ వైపు దూసుకెళ్లింది. కానీ సెకండ్ స్లిప్​లో ఫీల్డింగ్ చేస్తున్న ప్లేయర్ అలర్ట్​గా లేకపోవడంతో అతడి చేతులను తాకిన బంతి గాల్లోకి లేవగా.. ఫస్ట్ స్లిప్ ఫీల్డర్ మహమ్మద్ నబీ అందుకున్నాడు.

క్యాచ్​ను చేజార్చిన ఫీల్డర్ రహ్మత్​ షా​పై మహమ్మద్ నబీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొద్దిలో క్యాచ్ మిస్సయ్యేది అంటూ అతడిపై సీరియస్​ అయ్యాడు. బాల్​తో రహ్మత్​ను కొట్టబోయాడు. ఈ క్యాచ్​కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫకర్ తర్వాత కెప్టెన్ బాబర్ ఆజం (0), మహమ్మద్ రిజ్వాన్ (21), అఘా సల్మాన్ (7) వికెట్లను కోల్పోయింది పాక్. 47.1 ఓవర్లలో ఆ జట్టు 201 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. అయితే తక్కువ స్కోరును ఛేదించి పాక్​కు అఫ్గాన్ షాక్ ఇస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ జట్టు 19.2 ఓవర్లలో 59 రన్స్​కే ఆలౌట్ అయింది. పాక్ పేసర్ హారిస్ రౌఫ్ ఏకంగా 5 వికెట్లతో సత్తా చాటాడు.