iDreamPost
android-app
ios-app

ఇప్పటికైనా కోహ్లీని విమర్శించడం మానేస్తారా? లేకపోతే మీ కర్మ అంతే: టీమిండియా మాజీ క్రికెటర్

  • Published May 10, 2024 | 9:40 AM Updated Updated May 10, 2024 | 9:40 AM

పంజాబ్ పై ఆడిన ఇన్నింగ్స్ చూసిన తర్వాతైనా మీరు నోర్లు మూస్తారా? అంటూ కోహ్లీని విమర్శించిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. ఆ వివరాల్లోకి వెళితే..

పంజాబ్ పై ఆడిన ఇన్నింగ్స్ చూసిన తర్వాతైనా మీరు నోర్లు మూస్తారా? అంటూ కోహ్లీని విమర్శించిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. ఆ వివరాల్లోకి వెళితే..

ఇప్పటికైనా కోహ్లీని విమర్శించడం మానేస్తారా? లేకపోతే మీ కర్మ అంతే: టీమిండియా మాజీ క్రికెటర్

‘పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు, మంచి వాళ్లకే కష్టాలు’ అన్న సామెతలను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ప్రస్తుతం ఈ సామెతలు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అచ్చంగా సరిపోతాయి. ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణిస్తూ.. పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. దాంతో పాటుగా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ముందుకుసాగుతున్నాడు. అయినప్పటికీ.. కోహ్లీ స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడని, ఆర్సీబీ ఓటములకు మెయిన్ రీజన్ కోహ్లీనే అని, యంగ్ ప్లేయర్ల కంటే తక్కువ స్ట్రైక్ రేట్ కలిగి ఉంటున్నాడని పెద్ద ఎత్తున విరాట్ పై విమర్శలు గుప్పించారు మాజీ క్రికెటర్లు. తాజాగా పంజాబ్ పై ఆడిన ఇన్నింగ్స్ చూసిన తర్వాతైనా మీరు నోర్లు మూస్తారా? అంటూ కోహ్లీని విమర్శించిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.

IPL 2024లో తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు విరాట్ కోహ్లీ. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 47 బంతుల్లోనే 92 పరుగులు చేసి టీమ్ భారీ స్కోర్ కు, విజయానికి కారణం అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసిన తర్వాత కూడా అతడిపై ఇంకా విమర్శలు కొనసాగిస్తారా? అంటూ ప్రశ్నించాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. మ్యాచ్ అనంతరం ఓ మీడియాతో మాట్లాడుతూ..

“ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ను మీరు గమనించారా? అతడు 47 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఇక్కడ కోహ్లీ సెంచరీ కోసం చూసుకోలేదు. అర్షదీప్ వేసిన 18వ ఓవర్లో సిక్స్ కొట్టడానికి ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దీన్ని బట్టే అర్ధం అవుతుంది అతడు జట్టుకోసం ఆడే ప్లేయర్ అని. ఇప్పటికైనా స్లో బ్యాటింగ్, తక్కువ స్ట్రైక్ రేట్ అంటూ కూర్చుని విమర్శించే వాళ్లు నోర్లు మూస్తారా? మూయకపోతే ఇక మీ కర్మ అంతే” అంటూ కోహ్లీపై విమర్శలు చేసేవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. కాగా.. క్రికెట్ గురించి తెలియని వారు కోహ్లీని విమర్శిస్తున్నారంటే వేరే అనుకోవచ్చు.. కానీ ఆట గురించి అన్నీ తెలిసిన మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై చౌకబారిన వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని విరాట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కోహ్లీకి మద్ధతుగా నిలుస్తూ.. కైఫ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Middle stump Cricket (@middle.stump.cric)