iDreamPost
android-app
ios-app

Andre Russell: వీడియో: రస్సెల్ పిచ్చకొట్టుడుకు బిత్తరపోయిన రౌఫ్.. ఇది నెక్స్ట్ లెవల్ హిట్టింగ్!

  • Published Jul 08, 2024 | 9:28 PM Updated Updated Jul 08, 2024 | 9:28 PM

వెస్టిండీస్ విధ్వంసకారుడు ఆండ్రీ రస్సెల్ గురించి తెలిసిందే. క్రీజులోకి దిగితే ఫస్ట్ బాల్ నుంచే బౌలర్లను ఊచకోత కోస్తాడు. తాజాగా అతడి బ్యాట్ జోరుకు పాకిస్థాన్ పేసర్ హ్యారిస్ రౌఫ్ బలయ్యాడు.

వెస్టిండీస్ విధ్వంసకారుడు ఆండ్రీ రస్సెల్ గురించి తెలిసిందే. క్రీజులోకి దిగితే ఫస్ట్ బాల్ నుంచే బౌలర్లను ఊచకోత కోస్తాడు. తాజాగా అతడి బ్యాట్ జోరుకు పాకిస్థాన్ పేసర్ హ్యారిస్ రౌఫ్ బలయ్యాడు.

  • Published Jul 08, 2024 | 9:28 PMUpdated Jul 08, 2024 | 9:28 PM
Andre Russell: వీడియో: రస్సెల్ పిచ్చకొట్టుడుకు బిత్తరపోయిన రౌఫ్.. ఇది నెక్స్ట్ లెవల్ హిట్టింగ్!

ప్రస్తుత క్రికెట్​లో చాలా మంది విధ్వంసక ప్లేయర్లు ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్నవాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఒకవైపు ధనాధన్ బ్యాటింగ్​తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించడం, మరోవైపు పేస్ బౌలింగ్​తో వికెట్లు తీయడం, అలాగే మెరుపు ఫీల్డింగ్​తో రన్స్ కాపాడే ప్లేయర్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి ఆల్​రౌండర్స్​లో టాప్​ ప్లేస్​లో ఉంటాడు విండీస్ విధ్వంసకారుడు ఆండ్రీ రస్సెల్. అతడు టీమ్​లో ఉన్నాడంటేనే ప్రత్యర్థి జట్లు భయపడతాయి. క్రీజులోకి దిగితే ఫస్ట్ బాల్ నుంచే బౌలర్లను ఊచకోత కోస్తాడతను. పేసర్, స్పిన్నర్ అనే తేడాల్లేకుండా దంచి వదిలిపెడతాడు. తాజాగా అతడి బ్యాట్ జోరుకు పాకిస్థాన్ పేసర్ హ్యారిస్ రౌఫ్ బలయ్యాడు.

మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్​సీ)లో రెచ్చిపోయాడు రస్సెల్. శాన్​ఫ్రాన్సిస్కో యూనికార్న్స్​తో జరిగిన మ్యాచ్​లో చెలరేగిపోయాడీ లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ బ్యాటర్. 25 బంతుల్లోనే 40 పరుగులు చేశాడతను. 2 బౌండరీలు బాదిన రస్సెల్.. 3 భారీ సిక్సులు కొట్టాడు. ఎదురొచ్చిన ప్రత్యర్థి బౌలర్లను పిచ్చకొట్టుడు కొట్టాడు. బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడిన రస్సెల్ కొట్టిన ఓ సిక్స్ చూసి అపోజిషన్ బౌలర్ రౌఫ్ బిత్తరపోయాడు. అతడి బౌలింగ్​లో రస్సెల్ కొట్టిన బాల్ ఏకంగా 107 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. ఆఫ్ స్టంప్ మీద పడి లోపలకు వస్తున్న బంతిని ఆన్ సైడ్ లాగి కొట్టాడు రస్సెల్. కరెక్ట్​గా టైమ్ అవడం, అతడి హ్యాండ్ పవర్​కు స్టేడియం బయట పడింది బాల్.

రస్సెల్ దెబ్బకు బాల్ కనిపించకుండా పోయింది. ఆ సిక్స్ చూసి బౌలర్ రౌఫ్​తో పాటు సొంత టీమ్​మేట్స్ కూడా షాకయ్యారు. మరో ఆల్​రౌండర్ షకీబల్ హసన్ అయితే ఇదేం షాట్​ రా బాబు అంటూ ఆశ్చర్యపోయాడు. నమ్మశక్యం కానట్లు చూస్తూ ఉండిపోయాడు. అయితే రౌఫ్ బౌలింగ్​లో రస్సెల్ గతేడాది మేజర్ లీగ్ క్రికెట్​లోనూ ఓ భారీ సిక్సర్ కొట్టడం గమనార్హం. అప్పుడు అతడు కొట్టిన షాట్ ఏకంగా 108 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. ఇప్పుడు 107 మీటర్లు వెళ్లింది. రౌఫ్ పేస్​ను వాడుకొని బంతుల్ని స్టేడియం దాటిస్తున్నాడు రస్సెల్. అతడి మైండ్​ను చదువుతూ ఎప్పుడు ఏ లెంగ్త్​లో వేస్తాడో కనిపెట్టడం వల్లే ఇలాంటి షాట్లు సాధ్యం అవుతున్నాయి. మరి.. రస్సెల్ సిక్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.