iDreamPost
android-app
ios-app

క్రికెటర్‌ సిరాజ్‌ను కలిసిన MLA కౌశిక్‌ రెడ్డి.. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్!

హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి క్రికెటర్ సిరాజ్ ను కలిశారు. టీమిండియా క్రికెటర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ను కలిసిన విషయాన్ని కౌశిక్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు.

హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి క్రికెటర్ సిరాజ్ ను కలిశారు. టీమిండియా క్రికెటర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ను కలిసిన విషయాన్ని కౌశిక్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు.

క్రికెటర్‌ సిరాజ్‌ను కలిసిన MLA కౌశిక్‌ రెడ్డి.. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్!

తెలంగాణకు చెందిన యువ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ టీమిండియాలో కీలక ప్లేయర్ గా రాణిస్తున్నాడు. అద్భుతమైన బౌలింగ్ తో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు సిరాజ్. ప్రత్యర్థి టీమ్ లో ఎలాంటి ప్లేయర్ నైనా తన నిప్పులు చెరిగే బంతులతో చెమటలు పట్టిస్తూ కొరకరాని కొయ్యగా మారిపోయాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం సిరాజ్ సొంతం. కాగా తాజాగా తెలంగాణలోని హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి సిరాజ్ ను కలిశారు. టీమిండియా క్రికెటర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ను కలిసిన విషయాన్ని కౌశిక్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు.

ఆదివారం సిరాజ్‌తో సమావేశమైన తర్వాత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో సిరాజ్ తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్ నెట్టింటా వైరల్ గా మారింది. ఈ సందర్భంగా కౌశిక్‌ రెడ్డి ట్వీట్ చేస్తూ.. ‘సిరాజ్‌ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సిరాజ్ ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుగానే ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. తెలంగాణలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉన్న నా రికార్డును సిరాజ్‌ బ్రేక్‌ చేయడం సంతోషకరం’.. అంటూ కౌశిక్‌ రెడ్డి తెలిపారు. స్ఫూర్తిదాయకమైన నీ ప్రయాణం యువతకు ఆదర్శం అంటూ సిరాజ్ పై ప్రశంసలు గుప్పించారు.

ఈ సందర్భంగా.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే కోరిక ఎంత బలంగా ఉంటుందో.. సంకల్ప బలం కూడా అదే రీతిలో ఉంటేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలం అనే అర్థం వచ్చేలా ఓ కొటేషన్ ను కూడా రాసుకొచ్చారు కౌశిక్ రెడ్డి. అయితే రాజకీయాల్లో రాకముందు కౌశిక్‌ రెడ్డి క్రికెట్ ప్లేయర్. అతడు హైదరాబాద్ జట్టు తరఫున పలు మ్యాచ్ లు ఆడాడు. బౌలింతో పాటు ఆల్ రౌండర్ గా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంచి పేరుంది. మరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి టీమిండియా క్రికెటర్ సిరాజ్ ను కలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş