SNP
SNP
ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. భారత క్రికెట్ చరిత్రలోనే గొప్ప క్రికెటర్‌గా, భారత క్రికెట్‌కే దేవుడిలా ఎదిగిన సచిన్.. ఓ యాడ్‌తో చిక్కుల్లో పడ్డాడు. ముంబైలోని ఆయన ఇంటి ముందు కొంతమంది స్థానికులు నిరసనకు దిగారు. భారత రత్న లాంటి అత్యుత్తమ అవార్డు అందుకున్న సచిన్ టెండూల్కర్.. ఓ ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌కు ప్రచారం చేయడమే ఇందుకు కారణమైంది. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెటర్‌గా కొనసాగుతున్న సమయంలో, అలాగే ఆట నుంచి తప్పుకున్న తర్వాత కూడా పలు రకాల వ్యాపార ప్రకటనల్లో నటించాడు. చాలా బ్రాండ్‌లకు ప్రచారకర్తగా, బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా చేశాడు.
బూస్ట్ లాంటి సంస్థకైతే సచిన్ చేసిన యాడ్‌తో భారీ ప్రచారం లభించింది. ఇలా మరికొన్ని బ్రాండ్‌లకు కూడా సచిన్ ప్రచారం చేశాడు. అతనికున్న క్రేజ్, గుర్తింపు కారణంగా.. వ్యాపార సంస్థలు సచిన్‌తో ఒప్పందం కుదుర్చకుని, భారీ మొత్తంలో డబ్బులిచ్చి తమ ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటాయి. అయితే.. తాజాగా సచిన్ పేటీఎంకు చెందిన ఫస్ట్ గేమ్ అనే ఓ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు ప్రచారం చేశాడు. దీంతో కొంతమంది సచిన్ లాంటి గొప్ప క్రికెటర్.. ఇలా బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం కల్పించడం సరికాదని, యువతను తప్పుదొవపట్టిస్తున్నాడంటూ ఏకంగా సచిన్ ఇంటి ముందే ఆందోళనకు దిగారు.
‘బ్యాటింగ్ టూ బెట్టింగ్’ అంటూ ప్లకార్డులు పట్టుకుని సచిన్ నివాసం ముందు నిరసన తెలిపారు. ఆందోళనకారులు భారీ సంఖ్యలో సచిన్ ఇంటిముందుకు చేరుకోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ ఆందోళన వ్యవహరంపై సచిన్ టెండూల్కర్ మాత్రం ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. కాగా.. ఈ ఆందోళన స్థానిక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయిన బచ్చు కాడు ఆధ్వర్యంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే కూడా పాల్గొనడం గమనార్హం. మరి ఈ నిరసనతో సచిన్ ఆ బెట్టింగ్ యాప్‌కు ప్రచారం చేయడం మానేస్తాడో లేదో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#sachintendulkar @sachin_rt @bacchukadu #Mumbai #protest pic.twitter.com/Eb1DzbJwR0
— Sayyad Nag Pasha (@nag_pasha) September 1, 2023
ఇదీ చదవండి: నా కెరీర్లో కోహ్లీ టెక్నిక్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి: బాబర్ ఆజం