iDreamPost
android-app
ios-app

ముంబైని ఓడించి.. భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన స్టార్క్‌! కప్పు కొట్టిస్తా అంటూ..

  • Published May 04, 2024 | 2:57 PM Updated Updated May 04, 2024 | 2:57 PM

Mitchell Starc, IPL 2024, KKR: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన మిచెల్‌ స్టార్క్‌.. ఓ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అతని కాన్ఫిడెన్స్‌ చూస్తుంటే.. చెప్పింది చేసేలా ఉన్నాడు. స్టార్క్‌ ఏమన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Mitchell Starc, IPL 2024, KKR: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన మిచెల్‌ స్టార్క్‌.. ఓ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అతని కాన్ఫిడెన్స్‌ చూస్తుంటే.. చెప్పింది చేసేలా ఉన్నాడు. స్టార్క్‌ ఏమన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published May 04, 2024 | 2:57 PMUpdated May 04, 2024 | 2:57 PM
ముంబైని ఓడించి.. భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన స్టార్క్‌! కప్పు కొట్టిస్తా అంటూ..

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడు మిచెల్‌ స్టార్క్‌. ఈ ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్‌ను కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఏకంగా 24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ 2024 కోసం 2023 ఏడాది చివర్లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో స్టార్క్‌కు ఐపీఎల్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ధర దక్కింది. అంత ధర పెట్టి కొంటే.. స్టార్క్‌ మాత్రం ఈ సీజన్‌లో మొన్నటి వరకు దారుణంగా విఫలం అయ్యాడు. భారీగా పరుగులు సమర్పించుకుని టీమ్‌కే భారంగా మారాడు. అలాంటి ఆటగాడిని గాయం నెపంతో పక్కనకూడా పెట్టేసింది కేకేఆర్‌. అయితే.. స్టార్క్‌పై నమ్మకం ఉంచి.. మళ్లీ ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకొచ్చింది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన అసలు సత్తా చూపించాడు మిచెల్‌ స్టార్క్‌.

తన తొలి ఓవర్‌లోనే డేంజరస్‌గా ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అలాగే ముంబై ఇండియన్స్‌ విజయానికి 4 ఓవర్లలో 43 పరుగులు అవసరమైన సమయంలో తన పేస్‌ పదును చూపించి.. టిమ్‌ డేవిడ్‌తో పాటు మరో రెండు వికెట్లతో మొత్తం నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకుని.. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. 24.75 కోట్లు పెట్టి కొన్నందకు ఇన్ని రోజులకు కేకేఆర్‌కు కాస్త న్యాయం చేశాడు. 3.5 ఓవర్లు వేసిన స్టార్క్‌.. కేవలం 33 పరుగులు ఇచ్చి.. 4 కీలక వికెట్లు తీసుకుని.. ఈ సీజన్‌లోనే తన నుంచి బెస్ట్‌ ప్రదర్శన ఇచ్చాడు.అయితే.. ఈ మ్యాచ్‌ గెలిచిన తర్వాత స్టార్క్‌ చేసిన కామెంట్స్‌ వైరల్‌ అయ్యాయి.

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఈ సారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచేందుకు సాయపడతాను అంటూ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 2012, 2014లో కేకేఆర్‌ ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మళ్లీ ఎప్పుడు కప్పు గెలవలేదు. కానీ, ఈ సారి టీమ్‌ అద్భుతంగా ఆడుతుండటంతో క్రికెట్‌ అభిమానుల్లో కూడా కేకేఆర్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. పైగా స్టార్క్‌ ఒక్కసారి ఫామ్‌లోకి వస్తే.. ఒంటిచేత్తో మ్యాచ్‌ గెలిపించగలడు. ఇప్పటి వరకు సీజన్‌లో తన లయ కోల్పోయిన స్టార్క్‌.. కేకేఆర్‌ వర్సెస్‌ ఎంఐ మ్యాచ్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. మరి టైటిల్స్‌ గెలవడం బాగా అలవాటు ఉన్న స్టార్క్‌ లాంటి ప్లేయర్‌.. ఈ సారి కేకేఆర్‌కు టైటిల్‌ అందిస్తా అని చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.