iDreamPost
android-app
ios-app

VIDEO: సాంట్నర్ స్టన్నింగ్ క్యాచ్.. అమాంతం గాల్లోకి ఎగిరి..!

  • Author singhj Published - 03:22 PM, Mon - 11 September 23
  • Author singhj Published - 03:22 PM, Mon - 11 September 23
VIDEO: సాంట్నర్ స్టన్నింగ్ క్యాచ్.. అమాంతం గాల్లోకి ఎగిరి..!

‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అని క్రికెట్​లో ఒక నానుడి ఉంది. ఇది బాగా పాపులర్. జెంటిల్మన్ గేమ్​లో బ్యాటింగ్, బౌలింగ్​కు ఎంత ప్రాముఖ్యత ఉందో ఫీల్డింగ్​కు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఒక్క క్యాచ్ లేదా ఒక్క రనౌట్​తో మ్యాచ్ స్వరూపమే మారిపోతుందని అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 2019 వరల్డ్ కప్​ సెమీఫైనల్లో న్యూజిలాండ్​తో మ్యాచ్​లో కీలక సమయంలో భారత బ్యాట్స్​మన్ ఎంఎస్ ధోని రనౌట్ అయ్యాడు. ఒకవేళ ధోని ఔట్ కాకపోయుంటే ఆ మ్యాచ్​లో టీమిండియానే గెలిచేది. ఆ ఒక్క రనౌట్​ కారణంగా టోర్నమెంట్ నుంచి భారత్ నిష్క్రమించింది. చెప్పుకుంటూ పోతే క్రికెట్​లో బెస్ట్ ఫీల్డింగ్ అనేందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి.

ఒకప్పుడు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్లే ఫీల్డింగ్​ మెరుగ్గా చేసేవి. కానీ రానురాను అన్ని టీమ్స్ దీనిపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. తమ ఫీల్డింగ్​ను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఫీల్డింగ్ కోసం ప్రత్యేక కోచ్​తో పాటు ట్రెయినింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నాయి. వీటి ఫలితాలు కూడా క్రమంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే, ఇంగ్లండ్, న్యూజిలాండ్​కు మధ్య నాలుగు వన్డేల సిరీస్​లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్​లో ఇంగ్లీష్ టీమ్ 79 రన్స్ తేడాతో గెలుపొందింది. 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లండ్ జట్టు అన్ని ఓవర్లు ఆడి 7 వికెట్లకు 226 రన్స్ చేసింది. ఆ టీమ్​లో లియామ్ లివింగ్​స్టన్ (95 నాటౌట్), సామ్ కర్రన్ (42), మొయీన్ అలీ (33) రాణించారు.

ముఖ్యంగా లివింగ్​స్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్​కు భారీ స్కోరును అందించాడు. ఆ తర్వాత ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 26.5 ఓవర్లలో 147 రన్స్​కు ఆలౌట్ అయింది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్ (57), విల్ యంగ్ (33) మాత్రమే రాణించారు. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్​ సందర్భంగా ఓ అద్భుతం చోటుచేసుకుంది. ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్​లో మిడిల్ స్టంప్​పై పడిన బంతిని ఇంగ్లీష్ బ్యాటర్ జానీ బెయిర్​స్టో ఆన్ సైడ్​లోకి ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి అతడి బ్యాట్​ ఎడ్జ్ తీసుకొని కవర్స్​లోకి వెళ్లింది. అక్కడే కాచుకొని ఉన్న మిచెల్ సాంట్నర్ గాల్లోకి దూకి తన ఎడమ చేతితో అద్భుతంగా క్యాచ్​ను పట్టాడు. సాంట్నర్ క్యాచ్​ను బెయిర్ స్టో నమ్మలేకపోయాడు. సాంట్నర్ క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇదీ చదవండి: భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే ఎవరికి నష్టం?