iDreamPost
android-app
ios-app

Mitchell Marsh: మిచెల్ మార్ష్ అహంకారం.. వరల్డ్ కప్ పై మళ్లీ కాళ్లు పెడతా అంటూ..!

  • Author Soma Sekhar Published - 12:43 PM, Sat - 2 December 23

వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి తప్పు చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ తన అహంకారాన్ని మరోసారి చూపించాడు. అవకాశం వస్తే మరోసారి ప్రపంచ కప్ పై కాళ్లు పెడతానంటూ దిగజారి మాట్లాడాడు.

వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి తప్పు చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ తన అహంకారాన్ని మరోసారి చూపించాడు. అవకాశం వస్తే మరోసారి ప్రపంచ కప్ పై కాళ్లు పెడతానంటూ దిగజారి మాట్లాడాడు.

  • Author Soma Sekhar Published - 12:43 PM, Sat - 2 December 23
Mitchell Marsh: మిచెల్ మార్ష్ అహంకారం.. వరల్డ్ కప్ పై మళ్లీ కాళ్లు పెడతా అంటూ..!

వరల్డ్ కప్ ట్రోఫీని గెలవాలని క్రికెట్ ఆడే ప్రతీ ఆటగాడి డ్రీమ్. అందుకోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు ప్లేయర్లు. అదీకాక ప్రపంచ కప్ ట్రోఫీకి ఎంతో గౌరవం ఇస్తాడు. అలాంటి గౌరవమైన టైటిల్ పై చేతిలో బీరు సీసా పట్టుకుని కాళ్లు పెట్టాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్ లో ఇది జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మార్ష్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనపై ఇన్ని రోజుల తర్వాత స్పందించాడు మార్ష్. తప్పును ఒప్పుకోకుండా మరోసారి తన అహంకారాన్ని చూపించాడు. అవకాశం ఇస్తే మళ్లీ వరల్డ్ కప్ పై కాళ్లు పెడతా అంటూ దిగజారి మాట్లాడాడు.

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించాడు. ఇప్పటికే వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ టైటిల్ పై కాళ్లు పెట్టి దాని ప్రతిష్టను అవమానపరిచాడని వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ ప్రేమికులు, మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. ఇక ఇదే విషయంపై టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా మార్ష్ తీరును తప్పుపట్టాడు. కాగా.. మార్ష్ పై అలీఘర్ కు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఇక ఈ వివాదంపై మార్ష్ ఇన్ని రోజుల తర్వాత స్పందించాడు. తన తప్పు తెలుసుకోకుండా ట్రోఫీపై కాళ్లు పెట్టడాన్ని సమర్థించుకున్నాడు.

ఆస్ట్రేలియాకు చెందిన SEN రేడియోతో మిచెల్ మార్ష్ మాట్లాడుతూ..”నాకు వరల్డ్ కప్ ట్రోఫీని అగౌరవపరచాలన్న ఉద్దేశం లేదు. అయితే దాని గురించి పెద్దగా ఆలోచించను. ఇక నాపై ఈ విధంగా విమర్శలు వస్తున్నాయని చాలా మంది చెప్పారు. అప్పటి వరకు నాకీ విషయం తెలీదు. ఎందుకంటే నేను ఎక్కువగా సోషల్ మీడియా చూడను. అయితే అవకాశం వస్తే.. మరోసారి ఇలా చేయడానికి ఆలోచించను” అంటూ దిగజారుడు మాటలు మాట్లాడాడు మార్ష్. దీంతో మరోసారి కాంట్రవర్సీకి తెరలేపినట్లైంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో.. మార్ష్ పై ధ్వజమెత్తుతున్నారు మాజీ ప్లేయర్లు, క్రికెట్ ప్రేమికులు. ఇంత అహంకారం ఎందుకు నీకు అంటూ తిట్టిపోస్తున్నారు. ఎంత వరల్డ్ కప్ గెలిస్తే మాత్రం ఇంతలా రెచ్చిపోవాలా? మీరు ఇప్పటికీ మారరా? అంటూ సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. మరి మిచెల్ మార్ష్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.