SNP
Mayank Agarwal: విమానంలో వెళ్తూ.. విషపూరితమైన డ్రింక్ తాగి ప్రాణాల మీదకు తెచ్చకున్న టీమిండియా క్రికెటర్ తాజాగా కోలుకుని.. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Mayank Agarwal: విమానంలో వెళ్తూ.. విషపూరితమైన డ్రింక్ తాగి ప్రాణాల మీదకు తెచ్చకున్న టీమిండియా క్రికెటర్ తాజాగా కోలుకుని.. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
తాజాగా జరిగిన ఓ షాకింగ్ ఘటనతో భారత క్రికెటర్ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. దాదాపు ప్రాణాలు పోయే పరిస్థితుల్లో అతను ఐసీయూలో చేరాడు. వైద్యులు అత్యవసర చికిత్స అందించడంతో కాస్త కోలుకున్న అతను.. పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ విషపూరితమైన డ్రింక్ తాగి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రంజీ సీజన్ ఆడుతున్న మయాంక్.. ఈ క్రమంలో త్రిపుర జట్టుతో మ్యాచ్ కోసం కర్ణాటక టీమ్ త్రిపుర రాజధాని అగర్తాలకు వచ్చింది. మ్యాచ్ అనంతం అగర్తల నుంచి కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఢిల్లీకి విమానంలో బయలుదేరాడు.
ఈ క్రమంలోనే విమానంలో మంచినీళ్లు అనుకుని తన సీటు ఎదురుగా ఉన్న పౌచ్‌లోని బాటిల్‌లో ఉన్న డ్రింక్‌ను తాగేశాడు. అది తాగిన తర్వాత అగర్వాల్ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వాంతులు, గొంతు వాపు, బొబ్బలతో ఇబ్బందిపడ్డాడు. ఈ విషయాన్ని విమానంలోని సిబ్బందికి తెలియజేయడంతో.. వెంటనే విమానాన్ని తిరిగి వెనక్కి తీసుకెళ్లారు. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో విమానం మళ్లీ అగర్తాల లోనే ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అవ్వడంతోనే అగర్వాల్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు కొన్ని గంటల పాటు శ్రమించి.. అగర్వాల్‌ను కాస్త నార్మల్ పరిస్థితికి తీసుకొచ్చారు. విషపూరితమైన డ్రింగ్ తాగడం వల్లే అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో.. విమానంలో అలాంటి పదార్థాలు ఎలా ఉంచుతారని ఆగ్రహం వ్యక్తం చేసిన మయాంక్.. వెంటనే తన మేనేజర్‌తో పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. సదరు విమానయాన సంస్థపై అగర్వాల్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అగర్వాల్ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. అయితే.. అతన్ని త్రిపుర నుంచి బెంగళూరుకు తరలించేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అగర్వాల్ పోలీసులను ఆశ్రయించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mayank Agarwal has filed a police complaint to investigate the matter after he drank poisonous liquid from a pouch in the flight. pic.twitter.com/yAhlWCz1QS
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 31, 2024