వీడియో: ఆసీస్ స్టార్ స్మిత్​ను పోయించిన కుర్రాడు.. చూసి తీరాల్సిన ఔట్!

AUS vs ENG, Steve Smith, Matthew Potts: మోడర్న్ క్రికెట్​లో బెస్ట్ బ్యాటర్స్​లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్. అలాంటోడ్ని ఓ కుర్ర బౌలర్ వణికించాడు.

AUS vs ENG, Steve Smith, Matthew Potts: మోడర్న్ క్రికెట్​లో బెస్ట్ బ్యాటర్స్​లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్. అలాంటోడ్ని ఓ కుర్ర బౌలర్ వణికించాడు.

ప్రస్తుత క్రికెట్​లో టాప్ బ్యాటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్. ఇంగ్లండ్ స్టార్ జో రూట్, న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, టీమిండియా గ్రేట్ విరాట్ కోహ్లీతో కలసి ఈతరం అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు స్మిత్. మోడ్రన్ క్రికెట్​లో టాప్-4 బ్యాటర్లలో ఒకడిగా ఉన్న స్మిత్​ను ఔట్ చేయడం అంత ఈజీ కాదు. ఫార్మాట్ ఏదైనా అతడు ఒకేరీతిలో ఆడతాడు. క్రీజులో సెటిల్ అయ్యేందుకు కాస్త టైమ్ తీసుకుంటాడు. అప్పటిదాకా స్ట్రైక్ రొటేట్ చేసి ఆ తర్వాత దంచుడు మొదలుపెడతాడు. ఒక్కోసారి జిడ్డాటతో బౌలర్లకు విసుగు తెప్పిస్తుంటాడు. అతడ్ని ఔట్ చేయాలంటే బౌలర్లు బెస్ట్ డెలివరీ వేయాల్సిందే. అలాంటి స్మిత్​ను ఓ కుర్రాడు వణికించాడు. బాల్ టచ్ చేయాలంటే భయపడేలా చేశాడు. అతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..

స్టీవ్​ స్మిత్​తో ఓ పాతికేళ్ల యువ బౌలర్ ఆడుకున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో అతడ్ని భయపెట్టాడు. నిఖార్సయిన పేస్, అద్భుతమైన స్వింగ్ బౌలింగ్​తో డేంజరస్ బ్యాటర్​ను వణికించాడు. ఆ బౌలర్ పేరు మాథ్యూ పాట్స్. ఇంగ్లండ్​కు చెందిన ఈ పేసర్ స్మిత్​ను భయపెట్టి ఔట్ చేశాడు. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఈ సీన్ జరిగింది. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన ఇంగ్లీష్​ టీమ్ కంగారూలను బ్యాటింగ్​కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్​కు దిగిన ఆసీస్​కు మంచి స్టార్టే లభించినా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చాడు స్మిత్. భారీ ఇన్నింగ్స్​ ఆడాలని డిసైడ్ అయి వచ్చాడు. కానీ పేసర్ పాట్స్ ముందు అతడి ఆటలు సాగలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్​తో స్మిత్​ను రన్స్ చేయకుండా అడ్డుకున్న ఈ స్పీడ్​స్టర్.. స్టన్నింగ్ డెలివరీతో అతడ్ని క్లీన్​బౌల్డ్ చేశాడు.

మాథ్యూ పాట్స్ వేసిన 14వ ఓవర్​లోని అన్ని బంతులు ఆడాడు స్మిత్. అయితే నాలుగు బాల్స్ డాట్స్ చేసిన స్టార్ బ్యాటర్.. ఒక బౌండరీ కొట్టి బౌలర్​ను భయపెట్టాలని చూశాడు. కానీ పట్టువదలని పాట్స్.. సూపర్బ్ ఇన్​స్వింగర్​తో అతడి ఆట కట్టించాడు. గుడ్ లెంగ్త్​లో పడిన బంతిని స్ట్రయిట్ డ్రైవ్​గా మలచాలని చూశాడు స్మిత్. కానీ పడ్డాక లోపలకు దూసుకొచ్చిన బంతి అతడి బ్యాట్​ను దాటి ప్యాడ్స్​కు ఎడ్జ్ తీసుకొని వెళ్లి వికెట్లను గిరాటేసింది. దెబ్బకు స్టంప్స్​ చెల్లాచెదురవగా.. బెయిల్స్ ఎగిరి దూరంగా వెళ్లి పడ్డాయి. ఆ బాల్​కు మైండ్​బ్లాంక్ అయిన స్మిత్.. ఏం జరిగిందా అని ఆశ్చర్యపోయాడు. ఇంత పర్ఫెక్ట్ బాల్ వేస్తే తాను మాత్రం ఏం చేయగలనంటూ ఓ ఎక్స్​ప్రెషన్ ఇచ్చాడు. అతడు నిరాశతో క్రీజు వీడి పెవిలియన్ దిశగా నడక సాగించాడు. ఇక, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్ 44.4 ఓవర్లకు 270 పరుగులకు ఆలౌట్ అయింది. మరి.. స్మిత్ డిస్మిసల్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments