iDreamPost
android-app
ios-app

ఒక శకం ముగిసింది.. రిటైర్మెంట్ ప్రకటించిన డొమెస్టిక్ లెజెండ్స్!

  • Published Feb 20, 2024 | 10:41 AM Updated Updated Feb 20, 2024 | 10:41 AM

భారత దేశవాళీ క్రికెట్​లో ఓ శకం ముగిసింది. తమ ఆటతో క్రికెట్​కు వన్నె తెచ్చిన పలువురు లెజెండ్స్ ఒకే సమయంలో జెంటిల్మన్ గేమ్​కు వీడ్కోలు చెప్పేశారు.

భారత దేశవాళీ క్రికెట్​లో ఓ శకం ముగిసింది. తమ ఆటతో క్రికెట్​కు వన్నె తెచ్చిన పలువురు లెజెండ్స్ ఒకే సమయంలో జెంటిల్మన్ గేమ్​కు వీడ్కోలు చెప్పేశారు.

  • Published Feb 20, 2024 | 10:41 AMUpdated Feb 20, 2024 | 10:41 AM
ఒక శకం ముగిసింది.. రిటైర్మెంట్ ప్రకటించిన డొమెస్టిక్ లెజెండ్స్!

అందరు ఆటగాళ్లలాగే వాళ్లూ భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే కోరికతోనే కెరీర్​ను స్టార్ట్ చేశారు. లీగ్స్​లో రాణిస్తూ క్రమంగా డొమెస్టిక్ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లోనూ సత్తా చాటి ఏకంగా టీమిండియాకు ఆడే అవకాశాన్ని దక్కించుకున్నారు. అయితే బ్యాడ్ లక్, గాయాలు, ఫామ్ లేమి.. ఇలా కారణాలు ఏమైనా భారత జట్టుకు దూరమయ్యారు. నేషనల్ టీమ్​లోకి రీఎంట్రీ కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో దేశవాళ్లీల్లోనే ఆడుతూ అక్కడ లెజెండ్స్​గా మారారు. వాళ్లే బెంగాల్ దిగ్గజం మనోజ్ తివారీ, జార్ఖండ్ బిగ్ హిట్టర్ సౌరభ్ తివారీ, అదే రాష్ట్రానికి చెందిన వరుణ్ ఆరోన్, ముంబై స్టార్ పేసర్ ధవళ్ కులకర్ణి, విదర్భ రంజీ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ ఫయాజ్ ఫజల్. వీళ్లలో అందరూ భారత్​కు ఆడినవారే. ఒక్క వారం గ్యాప్​లో ఈ ఐదురుగూ క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లకు గుడ్​ బై చెప్పేశారు.

మనోజ్ తివారీ, సౌరభ్ తివారీ, వరుణ్ ఆరోన్, ధవళ్ కుళకర్ణి, ఫయాజ్ ఫజల్​ రిటైర్మెంట్ ప్రకటించడంతో డొమెస్టిక్ క్రికెట్​లో ఓ శకం ముగిసింది. ఈ ఐదురుగు లెజెండ్స్​కు ఐపీఎల్, టీమిండియా కాంట్రాక్ట్ లేదు. దీంతో వీళ్లు పాలిటిక్స్ సహా ఇతర మార్గాల్లో వెళ్లేందుకు క్రికెట్​కు వీడ్కోలు పలికారు. మనోజ్, ఆరోన్, ఫయాజ్ తాము కెరీర్​ను స్టార్ట్ చేసిన స్టేడియంలోనే ముగింపు పలకడం గమనార్హం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వీళ్లందరూ భారత క్రికెట్​లో ఓ వెలుగు వెలిగేవాళ్లు. సూపర్​స్టార్లుగా చలామణి అయ్యేవారు. కానీ పలు కారణాల వల్ల డొమెస్టిక్​ క్రికెట్​కే పరిమితం అయ్యారు. అయితే దేశవాళీల్లో తాము ప్రాతినిధ్యం వహించిన జట్ల తరఫున అద్భుతంగా ఆడుతూ ఆడియెన్స్​ను, అభిమానులను విశేషంగా అలరించారు. అందుకే వాళ్లు లెజెండ్స్​గా పేరు తెచ్చుకున్నారు.

మనోజ్ తివారీ 148 ఫస్ట్​క్లాస్ మ్యాచుల్లో ఆడి.. 10,195 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 303 నాటౌట్. 30 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు బాదాడతను. ముంబై పేసర్ ధవళ్ కులకర్ణి 95 మ్యాచుల్లో 281 వికెట్లు తీశాడు. సౌరభ్ తివారీ 116 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 8,076 పరుగులు చేశాడు. అతడి బ్యాట్ నుంచి 22 సెంచరీలు వచ్చాయి. స్పీడ్​స్టర్ వరుణ్ ఆరోన్ 66 మ్యాచుల్లో 173 వికెట్లు తీశాడు. ఫయాజ్ ఫజల్ 138 ఫస్ట్​క్లాస్ మ్యాచులు ఆడి.. 9,184 పరుగులు చేశాడు. అతడు భారత్ తరఫున కేవలం ఒకే మ్యాచ్​లో బరిలోకి దిగాడు.

2016లో జింబాబ్వేతో ఆడిన వన్డేలో 55 పరుగులు చేశాడు ఫజల్. మిగిలిన నలుగురు టీమిండియా తరఫున పలు మ్యాచులు ఆడారు. అయితే వీళ్లు ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో మాత్రం తమదైన ముద్ర వేశారు. అలాంటోళ్లు తక్కువ గ్యాప్​లో రిటైర్మెంట్ ప్రకటించడంతో డొమెస్టిక్ క్రికెట్​లో ఓ శకం ముగిసింది. వీళ్లు లేని లోటును ఆయా జట్లు భర్తీ చేయడం కష్టమే. కానీ కొత్త కుర్రాళ్లకు అవకాశాలు వస్తాయి. వీళ్లను స్ఫూర్తిగా తీసుకొని వాళ్లూ అదే బాటలో రాణిస్తే భారత్​కు ఆడటం ఖాయం. మరి.. డొమెస్టిక్ క్రికెట్​లో లెజెండ్స్​గా ఉన్న ఐదుగురు క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ భారత క్రికెటర్ మామూలోడు కాదు.. అతడో సైంటిస్ట్: మైకేల్ వాన్