iDreamPost

ఆ భారత క్రికెటర్ మామూలోడు కాదు.. అతడో సైంటిస్ట్: మైకేల్ వాన్

  • Published Feb 20, 2024 | 9:53 AMUpdated Feb 20, 2024 | 9:53 AM

రాజ్​కోట్ టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియాను ప్రశంసల్లో ముంచెత్తాడు మైకేల్ వాన్. ముఖ్యంగా భారత జట్టులోని ఓ క్రికెటర్​ను అతడు ఆకాశానికి ఎత్తేశాడు.

రాజ్​కోట్ టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియాను ప్రశంసల్లో ముంచెత్తాడు మైకేల్ వాన్. ముఖ్యంగా భారత జట్టులోని ఓ క్రికెటర్​ను అతడు ఆకాశానికి ఎత్తేశాడు.

  • Published Feb 20, 2024 | 9:53 AMUpdated Feb 20, 2024 | 9:53 AM
ఆ భారత క్రికెటర్ మామూలోడు కాదు.. అతడో సైంటిస్ట్: మైకేల్ వాన్

రాజ్​కోట్​ టెస్టులో నెగ్గిన భారత జట్టును అందరూ మెచ్చుకుంటున్నారు. బజ్​బాల్​తో భయపెట్టిన ఇంగ్లండ్​ను వరుసగా రెండో టెస్టుల్లో చిత్తుగా ఓడించడంతో రోహిత్ సేన మీద ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. అటాకింగ్​ గేమ్​తో వణికిస్తున్న ఇంగ్లీష్ టీమ్​ను వాళ్ల దారిలోనే వెళ్లి ఓడించడం సూపర్బ్ అని ప్రశంసిస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా భారత జట్టును మెచ్చుకున్నాడు. మూడో టెస్టులో మన టీమ్ ఆడిన తీరు అద్భుతమన్నాడు. అదే తరుణంలో టీమిండియాలోని ఓ క్రికెటర్ గురించి అతడు ప్రస్తావించాడు. ఆ భారత క్రికెటర్ మామూలోడు కాదన్నాడు. అతడో సైంటిస్ట్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. వాన్ ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్​తో జరిగిన మూడో టెస్టులో అతడు ఈ ఘనత సాధించాడు. లెజెండ్ అనిల్ కుంబ్లే (619 వికెట్లు) తర్వాత ఐదొందల క్లబ్​లో చేరిన రెండో భారతీయుడిగా నిలిచాడు అశ్విన్. ఈ సందర్భంగా అతడ్ని ప్రశంసల జల్లుల్లో ముంచెత్తాడు మైకేల్ వాన్. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లెజెండ్స్ షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ బాటలో అతడు నడుస్తున్నాడని తెలిపాడు. క్రికెట్​ను పర్ఫెక్ట్​గా అర్థం చేసుకున్న అతికొద్ది మందిలో అతడు ఒకడని చెప్పుకొచ్చాడు. ‘వార్న్, మురళీధరన్ బాటలో అశ్విన్ నడుస్తున్నాడు. అతడో ప్రొఫెసర్. క్రికెట్​ను బాగా అర్థం చేసుకున్న అశ్విన్ ఈ గేమ్​లో సైంటిస్ట్ లాంటోడు’ అని మైకేల్ వాన్ మెచ్చుకున్నాడు. అశ్విన్​పై వాన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

That Indian cricketer is a scientist!

అశ్విన్​పై వాన్ చేసిన కామెంట్స్ కరెక్ట్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. భారత స్పిన్నర్ నిజంగానే ప్రొఫెసర్ అని.. అతడిది పక్కా క్రికెటింగ్ బుర్ర అని చెబుతున్నారు. మ్యాచ్ కండీషన్స్, అపోజిషన్ టీమ్ బ్యాటర్స్​కు తగ్గట్లు వ్యూహాలు పన్నుతూ ఔట్ చేయడం, భారత్​ను ముందంజలో నిలపడం అశ్విన్​కే సాధ్యమని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, అశ్విన్​ బౌలింగ్​పై రియాక్ట్ అయిన మైకేల్ వాన్.. ఇంగ్లండ్ బజ్​బాల్​ స్ట్రాటజీ మీదా స్పందించాడు. ఆ జట్టు ఇదే ఫార్ములాతో ఆడి న్యూజిలాండ్​లో ఓడిందని.. అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్​నూ కోల్పోయిందని చెప్పాడు. వాళ్లు ఇలాగే ఆడుతూ పోతే భారత్​తో సిరీస్​ను కూడా చేజార్చుకోవడం ఖాయమని పేర్కొన్నాడు. సిరీస్​లు గెలుస్తున్నారా? లేదా? అనే దాని మీదే అంతా ఆధారపడి ఉంటుందని వాన్ స్పష్టం చేశాడు. మరి.. అశ్విన్ ఓ సైంటిస్ట్ అంటూ వాన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ధోని వల్లే నా కెరీర్ నాశనమైంది.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి