iDreamPost
android-app
ios-app

BCCI సంచలన నిర్ణయం! టీమిండియా హెడ్‌ కోచ్‌గా శ్రీలంక దిగ్గజం!

  • Published May 22, 2024 | 10:28 AM Updated Updated May 22, 2024 | 10:28 AM

Mahela Jayawardene, BCCI, Head Coach: ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌కు త్వరలోనే ఒక కొత్త హెడ్‌ కోచ్‌ వస్తాడనే విషయం అందరికి తెలిసిందే. అయితే.. ఆ కొత్త కోచ్‌ శ్రీలంక నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది. మరి అతను ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Mahela Jayawardene, BCCI, Head Coach: ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌కు త్వరలోనే ఒక కొత్త హెడ్‌ కోచ్‌ వస్తాడనే విషయం అందరికి తెలిసిందే. అయితే.. ఆ కొత్త కోచ్‌ శ్రీలంక నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది. మరి అతను ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published May 22, 2024 | 10:28 AMUpdated May 22, 2024 | 10:28 AM
BCCI సంచలన నిర్ణయం! టీమిండియా హెడ్‌ కోచ్‌గా శ్రీలంక దిగ్గజం!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత టీమిండియా కొత్త హెడ్‌ కోచ్‌ రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హెడ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగియనుండటంతో.. కొత్త కోచ్‌ వేటలో పడింది బీసీసీఐ. ఇప్పటికే కోచ్‌ పదవికి దరఖాస్తులు చేసుకోవాలంటూ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. 2024 నుంచి 2027 వరకు టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా పనిచేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా బీసీసీఐ సూచించింది. టీమిండియా హెడ్‌ కోచ్‌గా, ద్రవిడ్‌ వారుసులుగా వస్తున్నారంటూ చాలా పేర్లు వినిపించాయి. వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇలా చాలా పేర్లే వార్తల్లో నిలిచాయి. కానీ, బీసీసీఐ మాత్రం శ్రీలంక దిగ్గజ మాజీ క్రికెటర్‌ను టీమిండియా కోచ్‌గా తీసుకొచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.

ఎవరా లంక దిగ్గజ క్రికెటర్‌ అని ఆలోచిస్తున్నారా.. ఇంకెవరు మహేల జయవర్దనే. కెప్టెన్‌గా, ఆటగాడిగా.. శ్రీలంకను పటిష్టమైన జట్టుగా నడిపించిన జయవర్దనే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన తర్వాత.. కోచింగ్‌ వైపు రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. చాలా కాలం ముంబై ఇండియన్స్‌కు కూడా కోచ్‌గా పనిచేశాడు. జయవర్డనే కోచ్‌గా ఉన్న సమయంలోనే ముంబై ఇండియన్స్‌ రెండు సార్లు(2017, 2019) ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. అంతకంటే ముందు జయవర్దనే ఇంగ్లండ్‌ జట్టుకు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. జయవర్దనే కెప్టెన్సీలో శ్రీలంక జట్టు 2007 ప్రపంచ కప్ ఫైనల్‌ ఆడింది. ఆ వరల్డ్‌ కప్‌ తర్వాత బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో 2009లో కెప్టెన్‌గా వైదొలిగాడు. వన్డే వరల్డ్ కప్ 2011 ఫైనల్‌లో టీమిండియాపై జయవర్దనే సెంచరీ కూడా బాదాడు.

వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత తిరిగి లంక కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన జయవర్దనే.. 2013లో కెప్టెన్నీకి రాజీనామా చేశాడు. 2014లో టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహేల.. 2015 వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి. కోచ్‌గా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా, ముంబై ఇండియన్స్‌ కోచ్‌గా మంచి సక్సెస్‌ ఉన్న జయవర్దనేను టీమిండియా హెడ్‌ కోచ్‌గా తీసుకొని రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ విషయమై ఇప్పటికే జయవర్దనేతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం. అదే జరిగితే.. టెక్నికల్‌గా అద్భుతమైన దిగ్గజ ఆటగాడు టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా వస్తాడు. ద్రవిడ్‌కు తగ్గ వారసుడు కూడా అవుతాడని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. మరి జయవర్దనే టీమిండియా కోచ్‌గా వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.