iDreamPost
android-app
ios-app

IPL 2024: లక్నోకు బ్యాడ్ న్యూస్.. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ దూరం!

  • Published Apr 12, 2024 | 12:58 PM Updated Updated Apr 12, 2024 | 12:58 PM

ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన ఆటతీరుతో దూసుకెళ్తోంది లక్నో సూపర్ జెయింట్స్ టీమ్. ఇలాంటి జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ ప్లేయర్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరమైయ్యాడు.

ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన ఆటతీరుతో దూసుకెళ్తోంది లక్నో సూపర్ జెయింట్స్ టీమ్. ఇలాంటి జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ ప్లేయర్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరమైయ్యాడు.

IPL 2024: లక్నోకు బ్యాడ్ న్యూస్.. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ దూరం!

ఐపీఎల్ 2024 సీజన్ ను గాయాలు వదలడం లేదు. టోర్నీ ప్రారంభానికి ముందే స్టార్ ప్లేయర్లు కొందరు గాయాల కారణంగా టోర్నీకి దూరం కాగా.. మరికొందరు ఆరంభ మ్యాచ్ లకు అందుబాటులో లేకుండాపోయారు. ఇదిలా ఉండగా.. ఈ సీజన్ లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతోంది లక్నో సూపర్ జెయింట్స్. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ ల్లో మూడింట విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఇలాంటి టైమ్ లో లక్నోకు భారీ షాక్ తగిలింది.

మయాంక్ యాదవ్.. ఈ ఐపీఎల్ లో మారుమోగుతున్న పేరు. కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడిన అతడిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. 150కి పైగా కిలోమీటర్ల స్పీడ్ తో బంతులు వేస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తన స్పీడ్ తో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు ఈ యంగ్ స్టర్. అయితే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డాడు మయాంక్. దీంతో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా డగౌట్ చేరుకున్నాడు. గాయం గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని మేనేజ్ మెంట్ తొలుత చెప్పింది. దీంతో లక్నో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.

కానీ అనూహ్యంగా మయాంక్ ఇంజ్యూరీ గురించి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అతడి తుంటిపై వాపు ఇంకా ఉందని దీంతో రాబోయే రెండు మ్యాచ్ లకు మయాంక్ అందుబాటులో ఉండడని లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. అయితే ” మయాంక్ ఇంజ్యూరీలతో గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నాడని, వాటిని తట్టుకుని మరీ అతడు ఏం చేయగలడో ఇప్పటికే చూపించాడు. మయాంక్ ప్రదర్శన ప్రపంచం మెుత్తం చూసింది. ఇక ఈ ఏజ్ లో గాయాలు చాలా రోటీన్. అతడి శరీరం గట్టిపడే వరకు ఇదొక రోలర్-కోస్టర్ గా ఉంటుంది” అంటూ అసలు విషయాన్ని వెల్లడించాడు లాంగర్. తన స్పీడ్ బౌలింగ్ తో లక్నోకు బౌలింగ్ కు వెన్నముక్కలా ఉండే మయాంక్ రాబోయే రెండు మ్యాచ్ లకు దూరం కావడంతో.. పెద్ద దెబ్బపడనుంది.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)