ప్రపంచ ఫుడ్‌బాల్‌ దిగ్గజం క్రిష్టియానోకు లై డిటెక్టర్‌ టెస్ట్‌!

క్రిష్టియానో రొనాల్డో.. ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ ఫుట్‌ బాల్‌ దిగ్గజంగా ఆయనకంటూ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇక, సోషల్‌ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్‌ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా ప్రతీ దాంట్లో మిలియన్ల మంది ఆయన్ని ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రొనాల్డో లై డిటెక్టర్‌ టెస్ట్‌లో పాల్గొన్న వీడియో అది. ఇంతకీ ఆయన లై డిటెక్టర్‌ టెస్టులో ఎందుకు పాల్గొన్నారంటే..

బినాన్స్‌ అనే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన సంస్థ తాజాగా ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ క్రిష్టియానో రొనాల్డోకు లై డిటెక్టర్‌ టెస్టు చేయించింది. ఈ లై డిటెక్టర్‌ టెస్టు కేవలం ఇంటర్వ్యూ మాదిరిగానే జరిగింది. లై డిటెక్టర్‌ టెస్టులో భాగంగా ఆయన్ని పలు ప్రశ్నలు అడిగారు. వాటిలో ఎక్కువ వాటికి రొనాల్డో సరైన సమాధానాలు చెప్పారు. కొన్నింటికి మాత్రం అబద్ధాలు చెప్పారు. దాదాపు మూడు నిమిషాలు ఉన్న వీడియోను బినాన్స్‌ కంపెనీ తమ అఫిషియల్‌ యూట్యూబ్‌ ఖాతాలో విడుదల చేసింది.

ఆ వీడియో యూట్యూబ్‌లో విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు క్రిష్టియానో రొనాల్డోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారంటున్నారు. తన మీద తనకు చాలా నమ్మకం ఉన్న వ్యక్తి అతను అంటున్నారు. మరి, క్రిష్టియానో రొనాల్డో లై డిటెక్టర్‌ టెస్టులో పాల్గొనటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments