iDreamPost
android-app
ios-app

Pubity Sports List: ప్రపంచంలోనే టాప్‌ 5 అథ్లెట్స్‌ వీళ్లే! టీమిండియా నుంచి ఒక్కడికే చోటు

  • Published Dec 26, 2023 | 11:24 AM Updated Updated Dec 26, 2023 | 11:37 AM

ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'ప్యూబిటీ స్పోర్ట్స్' 2023 సంవత్సరానికి గానూ.. ప్రపంచంలోనే టాప్ 5 అథ్లెట్స్ లిస్ట్ ప్రకటించింది. అందులో టీమిండియా నుంచి ఒకే ఒక్క ఆటగాడు చోటుదక్కించుకున్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'ప్యూబిటీ స్పోర్ట్స్' 2023 సంవత్సరానికి గానూ.. ప్రపంచంలోనే టాప్ 5 అథ్లెట్స్ లిస్ట్ ప్రకటించింది. అందులో టీమిండియా నుంచి ఒకే ఒక్క ఆటగాడు చోటుదక్కించుకున్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

Pubity Sports List: ప్రపంచంలోనే టాప్‌ 5 అథ్లెట్స్‌ వీళ్లే! టీమిండియా నుంచి ఒక్కడికే చోటు

రికార్డులు, అవార్డులు ఓ క్రీడాకారుడి ప్రతిభకు కొలమానాలు కావు. అయితే అతడు మరింత రెచ్చిపోయి ఆడటానికి అవి బూస్ట్ లా పనిచేస్తాయి. తాజాగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘ప్యూబిటీ స్పోర్ట్స్’ 2023 సంవత్సరానికి గానూ.. ప్రపంచంలోనే టాప్ 5 అథ్లెట్స్ లిస్ట్ ప్రకటించింది. అందులో టీమిండియా నుంచి ఒకే ఒక్క ప్లేయర్ చోటు దక్కించుకున్నాడు. ఒక ప్లేయర్ ఆటతీరు, అతడి నిలకడ, రికార్డులు, అతడు ఆటపై తీసుకొచ్చిన ఇంపాక్ట్, అతడు గేమ్ లో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు ఇలాంటి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుని ప్యూబిటీ స్పోర్ట్స్ ఈ జాబితాను ప్రకటించింది. మరి ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు? టీమిండియా నుంచి చోటు దక్కించుకున్న ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

వివిధ క్రీడా రంగాల్లో క్రీడాకారులు చూపిన అసాధారణ ప్రతిభను దృష్టిలో పెట్టుకుని ప్యూబిటీ స్పోర్ట్స్ ప్రపంచంలోనే టాప్ 5 అథ్లెట్స్ లిస్ట్ ను ప్రకటించింది. వ్యక్తిగత రికార్డులు, స్థిరత్వం, క్రీడా స్ఫూర్తి, ప్రపంచంపై వారు తెచ్చిన ఇంపాక్ట్ ఇలాంటి అంశాలను పరిగణంలోకి తీసుకుని ఈ లిస్ట్ ను ప్రకటించింది సదరు మేనేజ్ మెంట్. ఈ జాబితాలో టీమిండియా నుంచి ఒకే ఒక్కడు చోటు దక్కించుకున్నాడు. అతడే రన్ మెషిన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ. వరల్డ్ లోని టాప్ 5 అథ్లెట్స్ జాబితాలో 5వ ప్లేస్ లో నిలిచాడు. తాజాగా జరిగిన వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా అగ్రస్థానంలో నిలిచి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్నాడు కింగ్ కోహ్లీ.

దీంతో పాటుగా సచిన్ 49 సెంచరీల ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసి.. ఔరా అనిపించాడు. ప్రపంచ క్రికెట్ పై తనదైన ముద్ర వేసి.. వరల్డ్ క్రికెట్ ను తన బ్యాట్ తో శాసిస్తున్నాడు. విరాట్ ఘనతను గుర్తించిన ప్యూబిటీ టాప్ 5లో గుర్తించి గౌరవించింది. అతడి ఫిట్ నెస్, డెడికేషన్, రికార్డులను పరిగణలోకి తీసుకుంది. విరాట్ తో పాటుగా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ప్యూబిటీ స్పోర్ట్స్ ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇక టాప్ 5 అథ్లెట్స్ లిస్ట్ లో అగ్రస్థానంలో అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఉన్నాడు. వరల్డ్ ఫుట్ బాల్ పై తనదైన ముద్రవేశాడు మెస్సీ. తనకే సాధ్యమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక ఈ లిస్ట్ లో మరో ఫుట్ బాల్ దిగ్గజం క్రిసియానో రొనాల్డో రెండో స్థానంలో ఉన్నాడు. పోర్చ్ గల్ కు చెందిన 38 ఏళ్ల రొనాల్డో ప్రపంచ ఫుట్ బాల్ పై చెరగని ముద్ర వేశాడు. ఇక బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ మూడో ప్లేస్ లో నిలిచాడు. 20వ శతాబ్దంలో తిరుగులేని రికార్డులు నెలకొల్పి.. తనకు తానే సాటిగా నిలిచాడు. అప్పట్లో బాక్సింగ్ అంటే అలీ.. అలీ అంటే బాక్సింగ్ అనేంతంగా తన ఆటతీరుతో వరల్డ్ బాక్సింగ్ రింగ్ ను తన పంచ్ తో ఏలాడు. ఇక ఈ జాబితాలో నాలుగో స్థానంలో అమెరికాకు చెందిన బాస్కెట్ బాల్ స్టార్ ప్లేర్ మైఖెల్ జోర్డాన్ నిలిచాడు. తన స్కిల్స్ తో బాస్కెట్ బాల్ చరిత్రలో తనకంటూ గొప్ప గుర్తింపు సంపాదించుకున్నాడు. మరి వరల్డ్ టాప్ 5 అథ్లెట్స్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న విరాట్ కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.