SNP
SNP
సాధారణంగా ఎంత పెద్ద విధ్వంసపు బ్యాటర్ సెంచరీ చేసినా.. మహా అయితే ఓ 8, 10 సిక్సులు ఉంటాయి. ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, పూరన్ లాంటి ఆటగాళ్లు సెంచరీలు చేస్తే 10 కంటే ఎక్కువ సిక్సులు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. కానీ, ఓ క్రికెటర్ మనిషిలా ఆడలేదు.. క్రికెట్ మెషీన్ లా ఆడాడు. ఆడింది.. 40 బంతులే కానీ కొట్టిన రన్స్ ఎంతో తెలుసా.. 163. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నమ్మి తీరాల్సిన నిజం. పైగా ఆ 40 బంతుల ఇన్నింగ్స్‌లో 23 సిక్సులు ఉన్నాయంటే మరింత షాక్ అవుతారు. ఇదేమీ ఈఏ స్పోర్ట్స్ వీడియో గేమ్ లో కొట్టినవి కావు. రియల్ గానే గ్రౌండ్ లో కొట్టిన పరుగులు. సునామీ ఇన్నింగ్స్, మెరుపు ఇన్నింగ్స్ లాంటి పదాలు సైతం.. ఈ ఇన్నింగ్స్‌ను వర్ణించడానికి సరిపోవు. అంత విధ్వంసం జరిగింది మరి. ఇంతకీ.. విస్పోటనం లాంటి ఇన్నింగ్స్ ఆడింది ఎవరు? అసలింతకీ ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందని ఆలోచిస్తున్నారా? పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
అసలు ఇలాంటి కొట్టుడు లైఫ్ లో చూసి ఉండరు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుస్సేన్ తబల కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ వాయించినట్టు.. బంతిని కొట్టడం, బౌండరీ అవతలకు పంపడం.. పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఈ విధ్వంసకర బ్యాటింగ్.. యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్ షిప్ 2023లో భాగంగా.. గ్రూప్ డీలో హంగేరి, టర్కీ దేశాల మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకుంది. హంగేరి ఓపెనర్.. లియోస్ డూప్లాయ్ ఈ విధ్వంసం సృష్టించాడు. టర్కీ బౌలర్లను చీల్చి చెండాడుతూ.. కొడితే సిక్స్ అన్నట్లు ఆడాడు. తాను ఎదుర్కొన్న 40 బంతుల్లో 23 సిక్సులు బాదాడంటేనే అర్థం చేసుకోవచ్చు, అతని ఊచకోత ఏ రేంజ్ లో సాగిందో. లియోస్ కొడుతుంటే.. బాల్ ఎక్కడ వేయాలో కూడా టర్కీ బౌలర్లకు అర్థం కాలేదు. బాల్ ఎక్కడ వేసినా.. ఎంత తోపు బౌలర్ వేసినా.. రిజల్ట్ మాత్రం సేమ్.
మొత్తం తాను ఆడిన 40 బంతుల్లో కేవలం 4 ఫోర్లు మాత్రమే కొట్టిన లియోస్.. 23 సిక్సులతో 163 పరుగులు చేశాడు. అతని దెబ్బకు 10 ఓవర్ల ఇన్నింగ్స్‌లో హంగేరి ఏకంగా 220 పరుగులు కొండంత స్కోర్‌ను చేసింది. లియోస్ కు మరో ఓపెనర్, హంగేరి కెప్టెన్ సైతం తోడైయ్యాడు. వినోత్ రవీంద్రన్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 45 పరుగులతో దుమ్మురేపాడు. లియోస్, రవీంద్రన్ దెబ్బకు టర్కీ బౌలర్లలో ఏకంగా నలుగురు బౌలర్లు తాము వేసిన ఒక్కో ఓవర్లో వరుసగా 29, 24, 32, 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 221 పరుగుల భారీ టార్గెట్ ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన టర్కీ జట్టు.. నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 89 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్‌లో లియోస్ విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
New ECN Record!🚨
Leus du Plooy plunders 1️⃣6️⃣3️⃣* off 40 balls, eclipsing the previous high of 156* by Gurvinder Bajwa! 🚀💯👑#EuropeanCricket #StrongerTogether #EuropeanCricketChampionship #ECC23 pic.twitter.com/VjT8Ibn3KW
— European Cricket (@EuropeanCricket) October 6, 2023
ఇదీ చదవండి: PAK vs NED: హరీస్ రౌఫ్ ఓవరాక్షన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన డచ్ ప్లేయర్!