SNP
SNP
ఆసియా కప్ 2023లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుతం టీమ్ మోస్ట్ సీనియర్ అండ్ సూపర్ స్టార్ ప్లేయర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ డ్రింక్స్ మోస్తూ కనిపించాడు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత.. చాలా సేపు కోహ్లీ డ్రింక్స్ తీసుకొస్తూ కనిపించాడు. దీంతో కెమెరా కళ్లని అతనిపైనే ఉన్నాయి. ఓ సూపర్ స్టార్ క్రికెటర్ అయి ఉండి, జట్టుకు చాలా ఏళ్లు కెప్టెన్‌గా చేసిన తర్వాత కూడా.. ఇంత హంబుల్‌గా ఏమాత్రం గర్వం లేకుండా.. మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్ల కోసం వాటర్ బాయ్‌గా మారడంతో కోహ్లీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే.. కోహ్లీకి కంటే ముందు కూడా దిగ్గజాలుగా పేరొందిన చాలా మంది క్రికెటర్లు మ్యాచ్ ఆడని సమయాల్లో డ్రింక్స్ మోశారు. అందులో కొంతమంది లెజెండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
విరాట్ కోహ్లీను మించిన దిగ్గజాలు క్రికెట్ ప్రపంచంలో ఎంత మంది ఉన్నారు. ప్రపంచం మొత్తం అభిమానించే, ఆరాధించే క్రికెటర్లలో డాన్ బ్రాడ్‌మన్, సచిన్ టెండూల్కర్ ముందు వరుసలో ఉంటారు. సచిన్ అయితే.. ఇండియన్ క్రికెట్‌కు గాడ్. అలాంటి క్రికటెర్లు సైతం ఒకానొక సమయంలో ఆటగాళ్లకు డ్రింక్స్ అందించారు. అది.. కెరీర్ తొలినాళ్లలో అనుకుంటే పొరపాటే.. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో, అప్పటికే గొప్ప క్రికెటర్లుగా కీర్తించడబడుతున్న టైమ్‌లోనే వాళ్లు వాటర్ బాయ్స్ అవతారం ఎత్తారు.
వీరితో పాటు ఆస్ట్రేలియాకు రెండు వరల్డ్ కప్స్ అందించిన కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ సైతం పలు మ్యాచ్‌ల్లో డ్రింక్స్ అందించాడు. షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్ లాంటి లెజెండరీ క్రికెటర్లు సైతం వాటర్ బాటిల్స్ మోశారు. షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్ ఎంత గొప్ప బౌలర్లలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారు నెలకొల్పిన కొన్ని రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అవి బ్రేక్ అవుతాయనేది నమ్మకం లేదు. ఇప్పటి చాలా మంది యువ బౌలర్లకు వాళ్లే స్ఫూర్తి. ఇక మరో ఇండియన్ గ్రేట్ గురించి మాట్లాడుకోవాలి.. అతనే మహేంద్రసింగ్ ధోని. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించినా.. కించితు గర్వం కూడా లేని గొప్ప క్రికెటర్. ఎప్పుడూ చాలా కామ్ అండ్ కూల్‌గా ఉండే ధోని.. ఒక మ్యాచ్‌లో ఆటగాళ్లకు డ్రింక్స అందించాడు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో విరాట్ కోహ్లీ కూడా చేరి.. క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli enjoying as a waterboy in today match.#INDvsBAN #ViratKohli #AsiaCup2023 #AsiaCup23 #BHAvsBAN #TeamIndia pic.twitter.com/JvviaWGrIm
— Thekhabriboys (@Thekhabriboys) September 15, 2023
ఇదీ చదవండి: బంగ్లాపై సెంచరీ చేసిన గిల్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన రోహత్ శర్మ!