iDreamPost
android-app
ios-app

వీడియో: గిల్ క్రేజ్.. ఐ లవ్ యూ అంటూ లేడీ ఫ్యాన్ రచ్చ!

  • Author Soma Sekhar Published - 05:00 PM, Fri - 29 September 23
  • Author Soma Sekhar Published - 05:00 PM, Fri - 29 September 23
వీడియో: గిల్ క్రేజ్.. ఐ లవ్ యూ అంటూ లేడీ ఫ్యాన్ రచ్చ!

ఆసీస్ తో వన్డే సిరీస్ ను విజయవంతంగా ముగించుకున్న టీమిండియా.. వరల్డ్ కప్ కు సిద్దమవుతోంది. ఇక ఈ మెగాటోర్నీలోకి హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది టీమిండియా. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న భారత జట్టు మరోసారి ఛాంపియన్స్ గా అవతరించే అవకాశం ఉంది. కాగా.. అక్టోబర్ 5 నుంచి ఆరంభం కానున్న మెగాటోర్నీ కోసం టీమిండియా ప్రాక్టీస్ మెుదలుపెట్టింది. వరల్డ్ కప్ కు ముందు ఇండియా రెండు వామప్ మ్యాచ్ లు ఆడనుంది. సెప్టెంబర్ 30న గువాహతి వేదికగా ఇంగ్లాండ్ తో తలపడనుంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్ ప్రారంభించాయి. కాగా.. టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ లేడీ ఫ్యాన్ గిల్ ఐ లవ్ యూ అంటూ అరచిన వీడియో వైరల్ గా మారింది.

శుబ్ మన్ గిల్.. ప్రస్తుతం టీమిండియాలో సక్సెస్ ఫుల్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. జట్టులోకి వచ్చిన కొద్దికాలంలోనే తన బ్యాటింగ్ తో టీమ్ లో స్థానాన్ని సుస్థిరపరచుకున్నాడు. వరల్డ్ కప్ టీమ్ లో సైతం చోటు దక్కించుకుని ఔరా అనిపించాడు. ఇదంతా గిల్ కు ఒకపక్కే.. శుబ్ మన్ గిల్ లో మరో రొమాంటిక్ కోణం ఉందని మనకు తెలియనిది కాదు. అతడు ఇప్పటికే సారా అలీ ఖాన్, సారా టెండుల్కర్ తో ప్రేమాయణాలు నడిపాడని ఎన్నో వార్తలు సైతం వచ్చాయి.

ఇక గిల్ కు లేడీ ఫ్యాన్ పాలోయింగ్ కూడా ఎక్కువనే చెప్పాలి. తాజాగా వరల్డ్ కప్ కోసం ప్రాక్టీస్ లో ఫుల్ బిజీగా ఉన్నారు టీమిండియా ఆటగాళ్లు. ఇంగ్లాండ్ తో జరిగే వామప్ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా.. ఓ లేడీ ఫ్యాన్ గిల్ ఐ లవ్ యూ అంటూ రచ్చ చేసింది. గ్రౌండ్ లో ఉన్న గిల్ ను చూస్తూ.. ఐ లవ్ యూ అంటూ గట్టిగా అరుస్తోంది. ఇది గమనించిన గిల్ ఆమెకు చెయ్ ఊపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by dimaakkarab (@dimaakkarab)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి