Somesekhar
Lady fan apologizes to Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఓ మహిళా అభిమాని బహిరంగ క్షమాపణలు చెప్పింది. మరి లేడీ ఫ్యాన్ ఎందుకు పాండ్యాకు సారీ చెప్పింది? ఆ వివరాల్లోకి వెళితే..
Lady fan apologizes to Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఓ మహిళా అభిమాని బహిరంగ క్షమాపణలు చెప్పింది. మరి లేడీ ఫ్యాన్ ఎందుకు పాండ్యాకు సారీ చెప్పింది? ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీమిండియా వరల్డ్ కప్ సాధించడంతో.. ఆటగాళ్లపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక వరల్డ్ కప్ గెలిచి.. స్వదేశంలో అడుగుపెట్టిన టీమిండియాకు ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే. ప్లేయర్లపై పూల వర్షం కురిపిస్తూ తమ ప్రేమను చాటుకున్నారు అభిమానులు. ఇక ముంబైలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో దాదాపు 3 లక్షల మంది క్రికెట్ లవర్స్ పాల్గొన్నారు. దాంతో ముంబై వీధులన్నీ జన సంద్రంగా మారాయి. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఓ మహిళా అభిమాని బహిరంగ క్షమాపణలు చెప్పింది. మరి లేడీ ఫ్యాన్ ఎందుకు పాండ్యాకు సారీ చెప్పింది? ఆ వివరాల్లోకి వెళితే..
హార్దిక్ పాండ్యా.. టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ హీరో. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 16 పరుగులను డిఫెండ్ చేసి.. జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. దాంతో అతడిపై వరల్డ్ వైడ్ గా ప్రశంసలు కురిశాయి. ఇదంతా ఇప్పుడు.. కానీ కొన్ని రోజుల క్రితం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టడం, ఆ సీజన్ లో బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్ గా దారుణంగా విఫలం కావడంతో తీవ్ర విమర్శల పాలైయ్యాడు. మరోవైపు రోహిత్ శర్మ ఫ్యాన్స్ సైతం పాండ్యాను ట్రోల్ చేశారు. కాగా.. ఓ మహిళా అభిమాని కూడా పాండ్యాను విపరీతంగా ట్రోల్ చేసింది. అందుకు ఇప్పుడు అతడికి బహిరంగ క్షమాపణలు చెప్పింది.
ఆ మహిళా అభిమాని మాట్లాడుతూ..”నేను హార్దిక్ పాండ్యాను క్షమాపణలు అడుగుతున్నాను. ఎందుకంటే? మెుదట్లో నేను పాండ్యాను విపరీతంగా ట్రోల్ చేశాను. అయితే అలా ఎందుకు చేశానో తెలీదు. ఇప్పుడు ఆ విమర్శలకు సారీ అడుగుతున్నాను. టీ20 వరల్డ్ కప్ లో హార్దిక్ వేసిన చివరి ఓవర్ చిరకాలం గుర్తుండిపోతుంది. మీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి” అంటూ లైవ్ టీవీలోనే ఆ లేడీ ఫ్యాన్ పాండ్యాను క్షమాపణలు కోరింది. కాగా.. ఈ మెగాటోర్నీలో హార్దిక్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్ లో 144 పరుగులు చేసి.. బౌలింగ్ లో 11 వికెట్లు పడగొట్టాడు. మరి లేడీ ఫ్యాన్ పాండ్యాకు సారీ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Female fan apologizes to Hardik Pandya after India wins T20 World Cup; Here’s why#HardikPandya #T20WorldCup #India #T20WorldCupWinhttps://t.co/s1dknqmsmI
— Mashable Middle East (@Mashable_ME) July 5, 2024