iDreamPost
android-app
ios-app

Hardik Pandya: వీడియో: హార్దిక్​పై టీషర్ట్ విసిరిన ఫ్యాన్.. బుమ్రా రియాక్షన్ చూస్తే నవ్వాగదు!

  • Published Jul 05, 2024 | 3:00 PM Updated Updated Jul 05, 2024 | 3:00 PM

టీమిండియా విక్టరీ సెలబ్రేషన్స్ అదిరిపోయాయి. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చిన క్రికెట్ స్టార్స్​కు అభిమానులు గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పారు.

టీమిండియా విక్టరీ సెలబ్రేషన్స్ అదిరిపోయాయి. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చిన క్రికెట్ స్టార్స్​కు అభిమానులు గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పారు.

  • Published Jul 05, 2024 | 3:00 PMUpdated Jul 05, 2024 | 3:00 PM
Hardik Pandya: వీడియో: హార్దిక్​పై టీషర్ట్ విసిరిన ఫ్యాన్.. బుమ్రా రియాక్షన్ చూస్తే నవ్వాగదు!

టీమిండియా విక్టరీ సెలబ్రేషన్స్ అదిరిపోయాయి. వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశానికి వచ్చిన క్రికెట్ స్టార్స్​కు అభిమానులు గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీని కలసిన అనంతరం ముంబైకి పయనమయ్యారు భారత ఆటగాళ్లు. వాళ్లకు ముంబై ఎయిర్​పోర్ట్​లో ఘనస్వాగతం లభించింది. టీమిండియా ఫ్లైట్​కు వాటర్ సెల్యూట్ చేశారు అధికారులు. ఆ తర్వాత ఎయిర్​పోర్ట్ నుంచి వాంఖడేకు బయల్దేరారు ప్లేయర్లు. మధ్యలో ఓపెన్ బస్​లో విక్టరీ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. వరల్డ్ కప్ హీరోలకు అభినందనలు తెలిపారు. కొందరు ఫ్యాన్స్ అయితే క్రికెటర్లను దగ్గర నుంచి చూడాలనే అత్యుత్సాహంతో చెట్ల మీదకు ఎక్కడం గమనార్హం.

జనసంద్రాన్ని దాటుకొని వాంఖడే స్టేడియంలోకి అడుగుపెట్టారు భారత క్రికెటర్లు. మెగాట్రోఫీతో వచ్చిన ప్లేయర్లను చూసేందుకు జనం భారీగా రావడంతో స్టేడియం హౌస్​ఫుల్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ తర్వాత విరాట్ కోహ్లీ విక్టరీ స్పీచ్ ఇచ్చారు. ఈ విజయం దేశానికి అంకితం అని అన్నారు. అనంతరం వాళ్లు డ్యాన్సులు చేస్తూ, డీజేలో వస్తున్న దేశభక్తి పాటలకు గొంతు కలుపుతూ అభిమానులను అలరించారు. రోహిత్, కోహ్లీతో పాటు శివమ్ దూబె, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా మాస్ స్టెప్స్​తో స్టేడియాన్ని షేక్ చేశారు. ఈ తరుణంలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేసిన ‘వందేమాతరం’ పాటకు టీమిండియా ఆటగాళ్లంతా గొంతు కలిపి అందర్నీ ఉత్సాహపరుస్తున్న టైమ్​లో హార్దిక్​ పాండ్యాపై ఓ ఫ్యాన్ టీషర్ట్ విసిరాడు.

కోహ్లీ సహా పలువురు ప్లేయర్లు తమ రెండు చేతుల్ని పైకి అంటూ ‘వందేమాతరం’ సాంగ్​ను ఆలపించారు. ఈ తరుణంలో పాండ్యా కూడా రెండు చేతుల్ని గాల్లోకి లేపి పాడుతూ కనిపించాడు. అయితే అతడు చేతిని పైకి ఎత్తగానే ఒక టీషర్ట్ వచ్చి అతడి చేతుల్లో పడింది. హఠాత్పరిణామానికి షాకైన హార్దిక్.. వెంటనే కోలుకొని దాన్ని కింద పడేశాడు. అయితే అతడి వెనకాలే ఉన్న జస్​ప్రీత్ బుమ్రా మాత్రం నవ్వాపుకోలేకపోయాడు. చప్పట్లు కొడుతూ నవ్వుల్లో మునిగిపోయాడు. పక్కనే ఉన్న ఇతర ఆటగాళ్లకు ఇలా జరిగిందని చూపిస్తూ వాళ్లను కూడా నవ్వుల్లో ముంచెత్తాడు. అయితే హార్దిక్ మాత్రం ఇది పట్టించుకోకుండా సెలబ్రేషన్స్​లో బిజీ అయిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. హార్దిక్-బుమ్రా ఫన్నీ సీన్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Memes Hub😁✨ (@enti_komedy_aa__)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet