iDreamPost

శ్రీలంక ప్లేయర్ థండర్ ఇన్నింగ్స్.. ప్రపంచ కప్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ!

  • Author Soma Sekhar Updated - 05:27 PM, Thu - 9 November 23

ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా.. రికార్డు ఫిఫ్టీతో చెలరేగాడు శ్రీలంక ప్లేయర్. దీంతో ఈ ప్రపంచ కప్ లో వేగవంతమైన అర్ధశతకం చేసిన బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు కుశాల్ పెరీరా.

ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా.. రికార్డు ఫిఫ్టీతో చెలరేగాడు శ్రీలంక ప్లేయర్. దీంతో ఈ ప్రపంచ కప్ లో వేగవంతమైన అర్ధశతకం చేసిన బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు కుశాల్ పెరీరా.

  • Author Soma Sekhar Updated - 05:27 PM, Thu - 9 November 23
శ్రీలంక ప్లేయర్ థండర్ ఇన్నింగ్స్.. ప్రపంచ కప్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ!

వరల్డ్ కప్ 2023లో రికార్డుల మీద రికార్డులు నమోదు అవుతూ ఉన్నాయి. కొన్ని ఘనతలు బ్యాటర్లు సాధిస్తే.. మరికొన్ని రికార్డులు బౌలర్లు తమ పేరిట లిఖించుకుంటున్నారు. ఇక ప్రపంచ కప్ లో భాగంగా బెంగళూరు వేదికగా తాజాగా న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో కివీస్ బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. కానీ ఓ బ్యాటర్ మాత్రం న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. వరల్డ్ కప్ లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు. దాంతో లంక గౌరవప్రదమైన స్కోర్ కు బాటలు వేశాడు ఈ ప్లేయర్.

ప్రపంచ కప్ 2023లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక ఆటగాడు రెచ్చిపోయి ఆడాడు. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా గానీ.. కాస్త కూడా బెదరకుండా రికార్డు అర్ధశతకంతో మెరిశాడు. కివీస్ బౌలర్లపై చిన్నపాటి యుద్ధాన్నే ప్రకటించాడు లంక ఓపెనర్ కుశాల్ పెరీరా. బౌండరీలతో విరుచుకుపడుతూ కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్స్ లతో ఈ మెగాటోర్నీలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పేరిట ఉండేది. అతడు ఈ వరల్డ్ కప్ లో ఇదే న్యూజిలాండ్ పై కేవలం 25 బంతుల్లో అర్ధశతకం బాది రికార్డు క్రియేట్ చేయగా.. తాజాగా ఈ రికార్డును బ్రేక్ చేశాడు లంక ఓపెనర్ పెరీరా.

ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో పెరీరా 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 రన్స్ చేసి ఫెర్గ్యూసన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ కు దిగింది శ్రీలంక జట్టు. ఇక ఆదిలోనే లంక జట్టుకు భారీ షాక్ తగిలింది. రెండో ఓవర్ లోనే స్టార్్ ఓపెనర్ పాథుమ్ నిస్సాంక(2)ను టీమ్ సౌథీ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత కివీస్ బౌలర్ల ధాటికి ఏ ఒక్క లంక బ్యాటర్ కూడా క్రీజ్ లో కొద్దిసేపుకూడా నిలదొక్కుకోలేకపోయారు. లంక బ్యాటర్లలో వరుసగా.. కుశాల్ మెండీస్(6), సమరవిక్రమ(1), చరిత అసలంక(8), మాథ్యూస్(16), ధనుంజయ డీ సిల్వా(19) దారుణంగా విఫలం అయ్యారు. దీంతో శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయ్యింది. చివర్లో మహేష్ తీక్షణ 91 బంతుల్లో 3 ఫోర్లతో 31 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచి లంకకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, ఫెర్గ్యూసన్, సాంట్నర్, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు పడగొట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి