DC vs RR: థర్డ్ అంపైర్ డెసిషన్ పై సంగక్కర రియాక్షన్ ఇదే! ఏమన్నాడంటే?

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో సంజూ శాంసన్ ఔట్ పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై స్పందించాడు రాజస్తాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర. ఆ వివరాల్లోకి వెళితే..

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో సంజూ శాంసన్ ఔట్ పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై స్పందించాడు రాజస్తాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర. ఆ వివరాల్లోకి వెళితే..

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఔట్ పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. షై హోప్ క్యాచ్ పట్టినప్పుడు అతడి కాలు బౌండరీ లైన్ కు తాకిందని, అయినప్పటికీ థర్డ్ అంపైర్ అవుట్ ఎలా ఇచ్చాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. 86 పరుగులు చేసిన శాంసన్ అవుట్ కావడంతో.. రాజస్తాన్ ఓటమి చెందింది. అతడు ఔట్ కాకుండా ఉంటే.. కచ్చితంగా మ్యాచ్ ఆర్ఆర్ గెలిచేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అంపైర్ల నిర్ణయాలపై స్పందించాడు రాజస్తాన్ రాయల్స్ కోచ్, శ్రీలంక మాజీ దిగ్గజం కుమార సంగక్కర.

సంజూ శాంసన్ కాంట్రవర్సియల్ ఔట్ ప్రపంచ క్రికెట్ లో చర్చనీయాంశంగా మారింది. దీంతో అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్ ఫలితాలే తారుమారు అవుతున్నాయి అంటూ క్రీడాభిమానులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ లో ఎన్నో తప్పులు చేశారు అంపైర్లు. తాజాగా శాంసన్ ను ఔట్ ఇచ్చి మరో తప్పు చేశారని నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో సంజూ విషయంలో థర్డ్ అంపైర్ ఇచ్చిన డెసిషన్ పై స్పందించాడు రాజస్తాన్ కోచ్  సంగక్కర.

మ్యాచ్ అనంతరం సంగక్కర మాట్లాడుతూ..”క్రికెట్ మ్యాచ్ లో తుది నిర్ణయం థర్డ్ అంపైర్ దే. వారి డెసిషన్ కు కట్టుబడి ఉండటం ముఖ్యం. అయితే వారి నిర్ణయంతో సంబంధం లేకుండా మేము ఈ మ్యాచ్ లో గెలిచేవాళ్లం. కొన్ని కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. దానికి మనం ఏమీ చేయలేం. కానీ ఢిల్లీ జట్టు అద్భుతంగా ఆడింది. చివర్లో వారు బౌలింగ్ లో పుంజుకున్నతీరు అమోఘం. సంజూ సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. గ్రౌండ్ లోకి దిగాక అంపైర్ల నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే” అంటూ చెప్పుకొచ్చాడు సంగక్కర. అయితే అంపైర్లు తప్పు చేశారని తెలిసినప్పటికీ సంగక్కర ఇలా ప్రశాంతంగా స్పందించడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మరి సంజూ ఔట్ పై అంపైర్ ఇచ్చిన డెసిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments