iDreamPost

Sanju Samson: అంపైర్ల తప్పుడు డెసిషన్ కు బలైనా.. చరిత్ర సృష్టించిన శాంసన్!

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో అంపైర్ల తప్పుడు నిర్ణయానికి బలైనప్పటికీ.. ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. ఆ వివరాల్లోకి వెళితే..

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో అంపైర్ల తప్పుడు నిర్ణయానికి బలైనప్పటికీ.. ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. ఆ వివరాల్లోకి వెళితే..

Sanju Samson: అంపైర్ల తప్పుడు డెసిషన్ కు బలైనా.. చరిత్ర సృష్టించిన శాంసన్!

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అంపైర్ల తప్పుడు నిర్ణయానికి బలైయ్యాడు. 222 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్ఆర్ టీమ్ లో కీలక బ్యాటర్లు విఫలం అయ్యారు. ఒకరివెంట ఒకరు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుతున్నప్పటికీ.. ఒంటరి పోరాటం చేశాడు శాంసన్. ఈ మ్యాచ్ లో 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 86 పరుగులు చేసి ముకేశ్ కుమార్ బౌలింగ్ లో అంపైర్ల తప్పుడు నిర్ణయానికి బలైయ్యాడు. అయినప్పటికీ.. ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు శాంసన్.

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 86 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. సెంచరీ దిశగా సాగుతున్న అతడిని అంపైర్ల రూపంలో దురదృష్టం వెంటాడింది. ముకేశ్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సంజూ.. బౌండరీ లైన్ దగ్గర షై హోప్ కు చిక్కాడు. అయితే బాల్ పట్టే క్రమంలో అతడి కాలు బౌండరీ లైన్ కి తాకింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం శాంసన్ ను ఔట్ గా ప్రకటించాడు. దీంతో నిరాశగా పెవిలియన్ చేరాడు రాజస్తాన్ కెప్టెన్.

Samson who made history!

కాగా.. అంపైర్ల రాంగ్ డెసిషన్ అన్యాయంగా బలైనప్పటికీ ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు సంజూ శాంసన్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 200 సిక్సులు కొట్టిన ఇండియన్ ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్ లో అతడు 6 సిక్సులు బాదాడు. కాగా.. ఐపీఎల్ లో ఫాస్ట్ గా 200 సిక్సులు కంప్లీట్  చేసుకున్న ప్లేయర్ గా ఆండ్రీ రస్సెల్ అగ్రస్థానంలో ఉన్నాడు. మరి ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన శాంసన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి