iDreamPost
android-app
ios-app

Kuldeep Yadav: వీడియో: ఏ బ్యాటర్‌ కూడా ఈ బాల్‌ను ఆడలేడు! బాల్‌ను బొంగరంలా తిప్పాడు!

  • Published Feb 17, 2024 | 12:46 PM Updated Updated Feb 17, 2024 | 12:46 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత బౌలర్లు మ్యాచ్‌పై పట్టుబిగిస్తున్నారు. 2 వికెట్లకు 207 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కుల్దీప్‌ యాదవ్‌ ఒక అద్భుతమైన బాల్‌ వేసి ఔరా అనిపించాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత బౌలర్లు మ్యాచ్‌పై పట్టుబిగిస్తున్నారు. 2 వికెట్లకు 207 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కుల్దీప్‌ యాదవ్‌ ఒక అద్భుతమైన బాల్‌ వేసి ఔరా అనిపించాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Feb 17, 2024 | 12:46 PMUpdated Feb 17, 2024 | 12:46 PM
Kuldeep Yadav: వీడియో: ఏ బ్యాటర్‌ కూడా ఈ బాల్‌ను ఆడలేడు! బాల్‌ను బొంగరంలా తిప్పాడు!

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్ట్‌ హోరాహోరీగా సాగుతోంది. గురువారం ప్రారంభమైన టెస్ట్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ జడేజా సెంచరీలతో చెలరేగడంతో పాటు, తొలి మ్యాచ్‌ ఆడుతున్న యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ సైతం రాణించడం, చివర్లో టెయిలెండర్లు చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పడంతో.. టీమిండియాకు మంచి స్కోరే దక్కింది. అయితే.. తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్‌.. టీమిండియాకు గట్టి కౌంటర్‌ ఇచ్చింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 207 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ సెంచరీతో చెలరేగాడు.

మూడో రోజు ఆరంభంలో డకెట్‌ అదే టెంపోను కొనసాగించాడు. టీమిండియా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ.. 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. కానీ, కొద్ది సేపటికే కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో చెత్త షాట్‌ ఆడి అవుట్‌ అయ్యాడు. అంతకంటే ముందు కుల్దీప్‌ యాదవ్‌ ఇంగ్లండ్‌కు ఊహించని షాకిచ్చాడు. 224 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ సీనియర్‌ బ్యాటర్‌ జో రూట్‌ అవుట్‌ అయ్యాడు. ఆ వెంటనే కొత్తగా క్రీజ్‌లోకి వచ్చిన డేంజరస్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టోను మరుసటి ఓవర్‌లోనే కుల్దీప్‌ యాదవ్‌.. తన స్పిన్‌ మ్యాజిక్‌తో ఖంగుతినిపించాడు. ఇన్నింగ్స్‌ 40వ ఓవర్‌ వేసిన కుల్దీప్‌.. కరెక్ట్‌గా సెట్‌ చేసి.. మరీ అవుట్‌ చేశాడు. తొలి మూడు బంతులతో బెయిర్‌ స్టోను ఇబ్బంది పెట్టి.. అతన్ని ఒత్తిడిలో పెట్టిన కుల్దీప్‌ నాలుగో బంతిని అద్భుతంగా వేశాడు. రౌండ్‌ ది వికెట్‌ నుంచి.. ఆఫ్‌ సైడ్‌ బాల్‌ వేసి.. వికెట్ల వైపు తిప్పాడు.

ఆ బాల్‌కు బెయిర్‌ స్టో ఫీజులు ఎగిరిపోయాయి. అస్సలు ఏ మాత్రం ఆ బాల్‌ను ఆడలేకపోయిన బెయిర్‌ స్టో వికెట్ల ముందు దొరికిపోయాడు. లెగ్‌ బిఫోర్‌గా డకౌట్‌ అయి పెవిలియన్‌ చేశారు. ఆ అవుట్‌కు సంబంధించిన రివ్యూ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాల్‌ బొంగరంలా తిరిగిందని, ఈ బాల్‌ను ప్రపంచంలో ఏ బ్యాటర్‌ కూడా ఆడలేడంటూ క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. నిజానికి ఆ బాల్ చూస్తుంటే.. అద్భుతంగా ఉంది. ఆ స్పిన్‌, ఆ బాల్‌ అమేజింగ్‌గా ఉన్నాయి. క్రీజ్‌లోకి కొత్తగా వచ్చిన బ్యాటర్‌ను అద్భుతమైన బంతులతో ఒత్తిడిలోకి నెట్టి.. బాల్‌ను చూస్తేనే భయపడే రేంజ్‌లోకి అతన్ని తీసుకొచ్చి.. సరిగ్గా సెట్‌ చేసి వికెట్‌ తీయడం అంటే ఏంటో కుల్డీప్‌ యాదవ్‌ చూపించాడు. మరి జానీ బెయిర్‌స్టోను కుల్దీప్‌ యాదవ్‌ అవుట్‌ చేసిన విధానంతో పాటు, ఆ బాల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.