Nidhan
Kuldeep Yadav Excited To Play In Pakistan: క్రికెటర్లకు కొన్ని ఫేవరెట్ గ్రౌండ్స్ ఉంటాయి. నచ్చిన దేశాలు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్లి ఆడాలని కోరుకుంటారు. ఓ టీమిండియా స్టార్ కూడా ఇలాగే ఓ దేశంలో ఆడాలని అనుకుంటున్నాడు. ఛాన్స్ వస్తే పాకిస్థాన్‌లో ఆడతానని చెబుతున్నాడు.
Kuldeep Yadav Excited To Play In Pakistan: క్రికెటర్లకు కొన్ని ఫేవరెట్ గ్రౌండ్స్ ఉంటాయి. నచ్చిన దేశాలు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్లి ఆడాలని కోరుకుంటారు. ఓ టీమిండియా స్టార్ కూడా ఇలాగే ఓ దేశంలో ఆడాలని అనుకుంటున్నాడు. ఛాన్స్ వస్తే పాకిస్థాన్‌లో ఆడతానని చెబుతున్నాడు.
Nidhan
క్రికెటర్లకు కొన్ని ఫేవరెట్ గ్రౌండ్స్ ఉంటాయి. నచ్చిన దేశాలు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్లి ఆడాలని కోరుకుంటారు. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి సిరీస్‌ను గుర్తుండిపోయేలా మలచుకోవాలని అనుకుంటారు. ఓ టీమిండియా స్టార్ కూడా ఇలాగే ఒక దేశంలో ఆడాలని అనుకుంటున్నాడు. ఛాన్స్ వస్తే తప్పకుండా అక్కడ ఆడతానని చెబుతున్నాడు. అయితే అతడు చెప్పిన దేశంలో భారత జట్టు క్రికెట్ ఆడక చాలా ఏళ్లు అవుతోంది. ఆ భారత స్టార్ ఛాన్స్ వస్తే ఆడతానని అంటున్న దేశం మరేదో కాదు.. పాకిస్థాన్. అవకాశం వస్తే దాయాది దేశానికి వెళ్లి ఆడతానని అంటున్న ఆటగాడు మరెవరో కాదు టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. అతడు ఇంకా ఏమేం అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
వచ్చే ఏడాది ఆరంభంలో ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనుంది. ఈ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే టోర్నీలోని మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఐసీసీకి సమర్పించింది పాక్. అయితే ప్లేయర్ల సేఫ్టీ, ఇతర కారణాల వల్ల పాక్‌కు వెళ్లేది లేదని భారత్ చెబుతోంది. దీంతో ఈ టోర్నమెంట్ కోసం టీమిండియా దాయాది దేశానికి వెళ్తుందా? లేదా బీసీసీఐ కోరుతున్నట్లు హైబ్రిడ్ మోడల్లో భారత మ్యాచుల్ని ఇతర దేశంలో నిర్వహిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ అంశంపై రియాక్ట్ అయ్యాడు. ఒకవేళ ఛాన్స్ వస్తే టీమ్‌తో కలసి తప్పకుండా పాక్‌కు వెళ్లి అక్కడ ఆడతానని అతడు అన్నాడు. క్రికెటర్లుగా ఎక్కడికి పంపినా వెళ్లేందుకు తాము రెడీగా ఉంటామని చెప్పాడు కుల్దీప్.
‘క్రికెటర్లుగా ఎక్కడికి పంపినా వెళ్లేందుకు, ఆడేందుకు మేం రెడీగా ఉంటాం. అది మా రెస్పాన్సిబిలిటీ. ఇంతకుముందు ఎప్పుడూ పాకిస్థాన్‌కు వెళ్లలేదు. ఒకవేళ అక్కడికి వెళ్లే అవకాశం వస్తే తప్పకుండా వెళ్లి ఆడతా’ అని కుల్దీప్ స్పష్టం చేశాడు. ఓ ఈవెంట్లో పాల్గొన్న కుల్దీప్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్‌కు వెళ్తారా? అనే ప్రశ్నకు పైవిధంగా స్పందించాడు. ఇక, సరిహద్దు సమస్యలు, ఇతర కారణాల వల్ల భారత్-పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగి చాన్నాళ్లు కావొస్తోంది. ఆసియా కప్ లేదా ఐసీసీ టోర్నమెంట్స్‌లో తప్పితే ఈ రెండు జట్లు మరే సిరీస్‌లోనూ తలపడటం లేదు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్‌కు భారత జట్టును పంపాలా? వద్దా? అనే నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. మరి.. పాక్‌కు వెళ్లి ఆడతానంటూ కుల్దీప్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Kuldeep Yadav is excited to play 2025 Champions Trophy in Pakistan 🤩 pic.twitter.com/DpQI3KrBN3
— CricWick (@CricWick) August 26, 2024