iDreamPost
android-app
ios-app

ఇంగ్లండ్‌పై రెచ్చిపోతున్న కుల్దీప్‌ యాదవ్‌! హాఫ్‌ సెంచరీ కంప్లీట్‌

  • Published Mar 07, 2024 | 2:01 PM Updated Updated Mar 07, 2024 | 2:01 PM

Kuldeep Yadav, India vs England: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో కుల్దీప్‌ యాదవ్‌ తన స్పిన్‌ మ్యాజిక్‌తో అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఐదు వికెట్ల హాల్‌ సాధించాడు. అతని విజృంభన గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Kuldeep Yadav, India vs England: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో కుల్దీప్‌ యాదవ్‌ తన స్పిన్‌ మ్యాజిక్‌తో అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఐదు వికెట్ల హాల్‌ సాధించాడు. అతని విజృంభన గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 07, 2024 | 2:01 PMUpdated Mar 07, 2024 | 2:01 PM
ఇంగ్లండ్‌పై రెచ్చిపోతున్న కుల్దీప్‌ యాదవ్‌! హాఫ్‌ సెంచరీ కంప్లీట్‌

ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో టీమిండియా యువ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఆకవాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. తన స్పిన్‌ మ్యాజిక్‌తో ఇంగ్లండ్‌ బ్యాటర్లను వణికిస్తున్నాడు. బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, జాక్‌ క్రాలే, జానీ బెయిర్‌ స్టో, బెన్‌ స్టోక్స్‌ ఇలా అందరిని వరుసబెట్టి.. పెవిలియన్‌కు క్యూ కట్టించాడు. ఇప్పటికే ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల హాల్‌ సాధించిన కుల్దీప్‌.. జానీ బెయిర్‌స్టోను అవుట్‌ చేసి.. నాలుగో వికెట్‌ సాధించి టెస్టు క్రికెట్‌లో 50 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. కుల్దీప్‌ కేవలం 12వ మ్యాచ్‌లోనే 50 వికెట్ల మార్క్‌ను అందుకోవడం విశేషం.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, పిచ్‌ను చూసి తొలుత బ్యాటింగ్‌ చేస్తే ఉపయోగంగా ఉంటుందని బ్యాటింగ్‌ తీసుకున్నాడు. బెన్‌ నిర్ణయాన్ని సమర్ధిస్తూ.. ఇంగ్లండ్‌ ఓపెనర్లు బెన్‌ డకెట్‌, జాక్‌ క్రాలే తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించి మంచి స్టార్‌ అందించారు. కానీ కుల్దీప్‌ చెలరేగడంతో ఇంగ్లండ్‌కు కష్టాలు మొదలయ్యాయి. 64 పరుగులు వద్ద డకెట్‌ను, 100 రన్స్‌ వద్ద ఓలీ పోప్‌ను, 137 రన్స్‌ వద్ద హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి డేంజరస్‌గా మారుతున్న జాక్‌ క్రాలేను పెవిలియన్‌ చేర్చాడు. తర్వాత వచ్చిన జానీ బెయిర్‌ స్టో కాసేపు వేగంగా ఆడి కంగారు పెట్టాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 29 పరుగులు చేశాడు. కానీ, కుల్దీప్‌ మళ్లీ చెలరేగడంతో ఇంగ్లండ్‌ 175 పరుగుల వద్ద 6వ వికెట్‌ కోల్పోయింది. మరి ఇంగ్లండ్‌పై కుల్దీప్‌ ఐదు వికెట్లతో చెలరేగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.