SNP
ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే అందులోనా గబ్బాలాంటి వేదికలో ఓడించి కరేబియన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆ విజయంలో షమర్ జోసెఫ్ అనే యువ బౌలర్ల కీలక పాత్ర పోషించాడు. అయితే అతని గురించి చెప్తూ.. కేటీఆర్ ఒక వార్నింగ్ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే అందులోనా గబ్బాలాంటి వేదికలో ఓడించి కరేబియన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆ విజయంలో షమర్ జోసెఫ్ అనే యువ బౌలర్ల కీలక పాత్ర పోషించాడు. అయితే అతని గురించి చెప్తూ.. కేటీఆర్ ఒక వార్నింగ్ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఆస్ట్రేలియాలోని గబ్బాలో టెస్ట్ మ్యాచ్ గెలిచి వెస్టిండీస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై మ్యాచ్ గెలిచిన విండీస్.. అంబరాన్ని అంటేలా సంబురాలు చేసుకుంది. ఈ విజయంలో కరేబియన్ యువ క్రికెటర్ షమర్ జోసెఫ్ కీలక పాత్ర పోషించి, ఓవర్ నైట్ స్టార్‌గా మారాడు. బ్యాటింగ్ చేస్తున్న సయమంలో తన బొటనవేలికి తీవ్ర గాయమైనా సరే దాన్ని లెక్క చేయకుండా.. బౌలింగ్‌కు దిగి.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను చెల్లాచెదురుచేశాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి.. పటిష్టమైన ఆస్ట్రేలియాను 216 పరుగుల టార్గెట్‌ను కూడా ఛేజ్ చేయనివ్వకుండా గబ్బాలో కొత్త చరిత్ర లిఖించాడు. దీంతో క్రికెట్ ప్రపంచంలో జోసెఫ్ పేరు మారుమోగిపోయింది.
తాజాగా షమర్ జోసెఫ్ గురించి సిరిసిల్ల ఎమ్మెల్యే, తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. అతను మామూలోడు కాదని, అతనితో ప్రపంచంలోని బ్యాటర్లంతా జాగ్రత్తగా ఉండాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. నిజానికి షమర్ జోసెఫ్ ఎదిగిన విధానం ఎంతో అద్భుతంగా ఉందని, ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేలా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాపై షమర్ జోసెఫ్ చేసిన ప్రదర్శనతో ఒక్కసారిగా అందరి చూపు అతనిపై పడింది. పైగా అతని నేపథ్యం తెలిసిన తర్వాత.. జోసెఫ్ ప్రశంసల వర్షం కురుస్తోంది.
గయానాలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన జోసెఫ్.. ఆరంభంలో కట్టెలు కొట్టే కూలీగా పనిచేసేవాడు. పెళ్లి తర్వాత.. పట్టణానికి వలస వచ్చి.. చిన్న చిన్న కూలీ పనులు, సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తూ జీవినం సాగించాడు. ఆ క్రమంలోనే క్రికెట్‌పై ఇష్టంతో క్రికెట్ నేర్చుకుని.. స్పీడ్ బౌలర్‌గా సత్తా చాటాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో వెస్టిండీస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. తొలి సిరీస్ ఆడుతూ.. ఏకంగా 13 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. ఇలా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన జోసెఫ్, జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తి. మరి జోసెఫ్ లైఫ్ జర్నీతో పాటు కేటీఆర్ స్పందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#ShamarJoseph what a brilliant story! The cricketing world and all the batsmen, better be prepared for this sensational guy 👏👏
Watched the highlights of West Indies beating Australia at Gabba after 27 years!
Fast bowlers, when they are on a song are a real delight to watch pic.twitter.com/5lKqlzTPI8
— KTR (@KTRBRS) January 30, 2024